
పై ఫొటోను చూసి అమ్మాయి అనుకునేరు. అందులో ఉన్నది అబ్బాయి. పైగా అతను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో. కెరీర్ ప్రారంభంలో ఇండస్ట్రీలో మొదట క్లాప్ బాయ్‌గా తన జర్నీని ప్రారంభించాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‍గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా కూడా సక్సెస్ అయ్యాడు. ఆపై హీరోగానూ సూపర్ సక్సెస్ అయ్యాడు.. ఇలా హీరోగా, డైరెక్టర్ గా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా తదితర రంగాల్లో సత్తా చాటుతూ మల్టీపుల్ ట్యాలెంటెడ్ పర్సనాలిటీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన నటనా ప్రతిభకు ప్రతీకగా ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కూడా అందుకున్నాడు. ప్రస్తుతం ఇండియాలో బాగా గుర్తింపు ఉన్న పాన్ ఇండియా హీరోల్లో ఈ నటుడు కూడా ఒకడు. అయితే ఈ స్థాయికి రావడానికి అతను చాలా కష్టపడ్డాడు. చిన్నప్పటి నుంచి సొంత కాళ్లపై నిలబడడం నేర్చుకున్న అతను పాకెట్ మనీ కోసం మినరల్ వాటర్ అమ్మాడు. రాత్రంతా నీళ్లు సప్లై చేసి వ్యానుల్లోనే నిద్రపోయి ఉదయాన్నే ఇంటికి వెళ్లేవాడు. అలాగే హోటల్ వ్యాపారం కూడా చేశాడు. ఒకానొకదశలో పూర్తిగా అప్పుల ఊబిలో మునిగిపోయి మారు వేశాల్లో బయట తిరిగాల్సి వచ్చింది. అయితే మనో ధైర్యం కోల్పోకుండా గట్టిగా నిలబడ్డాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా, డైరెక్టర్ గా, హీరోగా సక్సెస్ అయ్యాడు. తన ప్రతిభతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకీ అతనెవరో గుర్తు పట్టారా? కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి.
రిషబ్ కు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉంది. అందుకే ఊరిలోని కళాకారులతో కలిసి ‘మీనాక్షి కల్యాణి’ అనే యక్షగాన నాటక ప్రదర్శనలో ఓ కీలక పాత్ర పోషించాడు. అప్పుడే ఊరందరితో చప్పట్లు కొట్టించుకున్నాడు రిషబ్. ఇక బెంగళూరులోని ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ తీసుకునేటప్పుడు రిషబ్ కు సోదరి అండగా నిలిచింది. అయితే ప్రతి విషయానికి అక్కపై ఆధారపడడం ఇష్టం లేని రిషబ్ మినరల్ వాటర్ క్యాన్లను అమ్మడం ప్రారంభించాడు. అలా సంపాదించిన డబ్బుతోనే సినిమాల్లోకి అడుగు పెట్టాడు.
ప్రస్తుతం కాంతారా చాఫ్టర్ వన్ సినిమాతో బిజి బిజీగా ఉంటున్నాడు రిషబ్ శెట్టి. గతంలో వచ్చిన కాంతారకు ఇది ప్రీక్వెల్ గా తెరకెక్కంది. ఈ మూవీకి రిషబ్ నే దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే హీరోగానూ నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ಕಾಂತಾರ ‘ದ ಪ್ರಪಂಚಕ್ಕೆ, ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸ್ವಾಗತ… ✨#WorldOfKantara – A glimpse into the making of our dream journey.#Kantara @hombalefilms @KantaraFilm @VKiragandur @ChaluveG #ArvindKashyap @AJANEESHB @PragathiRShetty #KantaraChapter1onOct2 pic.twitter.com/yvclUw26ZY
— Rishab Shetty (@shetty_rishab) July 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.,