Tollywood: దుబాయ్‌లో బ్యాంక్ జాబ్ మానేసి.. ఏకంగా 40 కిలోల బరువు తగ్గి.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరో ఎవరంటే?

సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన వాళ్లలో ఈ హీరో కూడా ఒకడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఇతను తన యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తన ట్యాలెంట్ తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి హీరోల ప్రశంసలు అందుకున్నాడు.

Tollywood: దుబాయ్‌లో బ్యాంక్ జాబ్ మానేసి.. ఏకంగా 40 కిలోల బరువు తగ్గి.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరో ఎవరంటే?
Tollywood Actor

Updated on: Sep 01, 2025 | 8:23 PM

ప్రస్తుతం సినిమాల్లో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది గతంలో వివిధ రకాలు పనులు, ఉద్యోగాలు చేసిన వారే. ఈ సౌతిండియన్ యాక్టర్ కూడా సరిగ్గా ఇదే జాబితాలోకి వస్తాడు. సినిమాల్లోకి రాక ముందు అతను దుబాయ్ లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పని చేశాడు. అయితే నటనపై ఆసక్తి ఉండడంతో మంచి జాబ్, దుబాయ్ లగ్జరీ లైఫ్ ను వదులుకుని ఇండియాకు వచ్చాడు. సినిమా అవకాశాల కోసం తిరిగాడు. అయితే ఆ సమయంలో కాస్త బొద్దుగా ఉండడంతో ఫిట్ నెస్ పై దృష్టి సారించాడు. ఏకంగా 40 కిలోల బరువు తగ్గి స్లిమ్ గా మారిపోయాడు. ఇదంతా పక్కన పెడితే.. చిన్నప్పటి నుంచే ఈ నటుడు పలు డిబేట్‌ల్లో పాల్గొన్నాడు. తన గంభీరమైన గొంతుతో అందరి మన్ననలు అందుకున్నాడు. అయితేరాను రాను అతని గొంతే సమస్యగా మారింది. చాలా మంది తన వాయిస్ ను అవహేళన చేశారు. ‘ నీ గొంతేంటి ఇంత వింతగా ఉంది’ అంటూ వెక్కిరించారు. ఇక సినిమా అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు కూడా తన వాయిసే తనకు అడ్డంకిగా మారింది. చాలా మంది దర్శకులు, నిర్మాతలు తన వాయిస్‌ బాలేదని తిరస్కరించారు.. కట్ చేస్తే.. ఇప్పుడు అదే వాయిస్ తో సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాడీ హీరో. చాలా మంది ఈ నటుడి వాయిస్ కోసమే సినిమాలకు వెళతారంటే అతి శయోక్తి కాదు. ఈ కారణంగానే ప్రభాస్, పవన్ కల్యాణ్ తదితర స్టార్ హీరోల సినిమాలకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ‘నీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉందబ్బా’ అంటూ ప్రశంసలు అందుకున్నాడు.

ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటున్నాడీ హ్యాండ్సమ్ హీరో. అదే సమయంలో లవ్, డేటింగ్ వంటి విషయాలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. తెలుగు, తమిళ సినిమాల్లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోన్న ఓ అందాల భామతో ఈ హీరో ప్రేమలో ఉన్నాడని ఇటీవల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో మరోసారి నెట్టంట ట్రెండ్ అవుతున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇంతకీ అతనెవరో తెలుసా? ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో కలిసి ఓజీ సినిమాలో యాక్ట్ చేస్తోన్న అర్జున్ దాస్.

ఇవి కూడా చదవండి

అర్జున్ దాస్ ఇన్ స్టా గ్రామ్ ఫోటోస్..

మట్టి కుస్తీ తో పాటు పలు సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు చేరువైన ఐశ్వర్య లక్ష్మీతో అర్జున్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. గతంలో ఇదే తరహా రూమర్లు రాగా, అర్జున్‌ దాస్ వాటిని‌ ఖండించారు. ఐశ్వర్య, తాము మంచి స్నేహితులమంటూ వివరణ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ అర్జున్ దాస్ ప్రేమ వ్యవహారం కోలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ దర్శకుడు బాలాజీ మోహన్ తెరకెక్కిస్తోన్న ఓ వెబ్‌ సిరీస్ లో అర్జున్ దాస్, ఐశ్వర్య కలిసి నటిస్తున్నారు. దీంతో మరోసారి వీరి లవ్ రూమర్లు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉండటం వల్లే కలిసి వెబ్‌ సిరీస్ లో నటిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.