Vijay Deverakonda: ఇదేందీ మావ..! విజయ్ దేవరకొండ, తమన్నా కలిసి నటించారా..!!

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఊహించని స్టార్ డమ్ ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ‘గీత గోవిందం’ తో వంద కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయాడు. ట్యాక్సీవాలా, డియర్ కామ్రేడ్ సినిమాలతో యూత్ ఐకాన్ గా మారిపోయాడు .

Vijay Deverakonda: ఇదేందీ మావ..! విజయ్ దేవరకొండ, తమన్నా కలిసి నటించారా..!!
Vijay Devarakonda

Updated on: Nov 29, 2025 | 11:59 AM

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ.. ఆతర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ డేస్‌లో పెద్ద హిట్స్ కొట్టకపోయినా విజయ్ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఇటీవలే  విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్ డమ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో విజయ్ పోలీస్ కానిస్టేబుల్ గా నటించి మెప్పించాడు.

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూపులు

విజయ్ దేవరకొండ చాలా మంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అలాగే విజయ్ దేవరకొండ తమన్నాతో కలిసి నటించారని మీకు తెలుసా.? అవును విజయ్ దేవరకొండ, మిల్కీ బ్యూటీ తమన్నా కలిసి నటించారు. అయితే అది సినిమా కోసం కాదు.. ఓ యాడ్ లో ఈ ఇద్దరూ కలిసి కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. అవును కేరీర్ బిగినింగ్ లో విజయ్ పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. అలాగే కొన్ని యాడ్స్ లోనూ నటించి మెప్పించాడు.

ఇవి కూడా చదవండి

ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ ఊపేస్తోంది.. సోషల్ మీడియా సెన్సేషన్ ఈ భామ

తమన్నా నటించిన ఓ యాడ్ లో విజయ్ దేవరకొండ కూడా కనిపిస్తాడు. తమన్నా హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన సమయంలో చాలా యాడ్స్ లో కనిపించింది. అలాగే చాలా మంది స్టార్స్‌తో యాడ్స్ చేసింది. అలాగే ప్రముఖ సెల్ ఫోన్ బ్రాండ్ సెల్కాన్ బ్రాండ్ ప్రమోషన్ కూడా చేసింది. ఇందుకోసం చేసిన ఓ యాడ్ లో విజయ్ కూడా కనిపిస్తాడు. ఈ యాడ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విజయ్ చాలా యంగ్ గా కాలేజీ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఈ వీడియోను విజయ్ అభిమానులు, తమన్నా అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

బస్సులో నుంచి దించేశారు.. భోజనం చేస్తుంటే అవమానించారు.. రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడి కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.