AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో మూడురోజుల కస్టడీ.. ఐ బొమ్మ రవి ఇంతకీ హీరోనా ?? విలనా ??

మరో మూడురోజుల కస్టడీ.. ఐ బొమ్మ రవి ఇంతకీ హీరోనా ?? విలనా ??

Phani CH
|

Updated on: Nov 29, 2025 | 11:44 AM

Share

ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కస్టడీ కొనసాగుతోంది. పైరసీ ద్వారా రూ.30 కోట్లు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. రవి ఒంటరిగానే ఈ పైరసీ చేశాడని, వెబ్‌సైట్ నిర్వహణకు ఇద్దరు స్నేహితులు సహకరించారని తేలింది. బెట్టింగ్ యాప్‌ల ద్వారా సంపాదించిన డబ్బులను క్రిప్టో కరెన్సీ ద్వారా బదిలీ చేశాడు. ఇప్పుడు రవి హీరోనా, విలనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

సినీ పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని మరో మూడు రోజుల కస్టడీకి ఇచ్చింది కోర్టు. రవిని ఇప్పటికే ఐదు రోజులపాటు విచారించినపోలీసులు..అతడి నుండి కీలక సమాచారం సేకరించారు. ఐ బొమ్మ సినీ పైరసీని రవి ఒక్కడే చేశాడని నిర్ధారించుకున్న పోలీసులు..పైరసీ ద్వారా సంపాదించిన మొత్తంలో 30 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీ వివరాలను సేకరించారు. ఇప్పుడు మరోసారి కస్టడీకి తీసుకొని సందేహాలు తీరని ప్రశ్నలన్నింటికీ రవి నుంచి జవాబులు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తెలుగు స్టేట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో నడుస్తోందీ ఐబొమ్మ రవి టాపిక్. రవి అరెస్ట్ కావడం, పైరసీ వెబ్‌సైట్‌ను క్లోజ్ చేయడం.. ఒక వర్షన్ మాత్రమే. మరో వర్షన్‌పై పెద్ద డిస్కషనే జరుగుతోందిప్పుడు. ఇటు సినీ ప్రేక్షకులతోపాటు అటు సాధారణ ప్రజలు తనవైపు చూసేలా చేసిన ఈ ఐ బొమ్మ రవి ఇంతకీ హీరోనా? విలనా? అనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. ఇందులో ఎవరి వాదనలు వారు వినిపిస్తున్న వేళ విచారణలో రవి ఆగడాల గురించి సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పైకి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌లా కనిపించే రవి… లోన కరుడుగట్టిన హార్డ్‌వేర్‌ క్రిమినల్ అంటున్నారు పోలీసులు. రవి ఐదు రోజుల కస్టడీలో మొదటి రోజు సర్వర్లు, యాప్స్‌తో సంబంధాలపై ప్రశ్నలు సంధించారు. రెండోరోజు SBI ఇన్సూరెన్స్‌లో సినిమాలపై ప్రశ్నించారు. మూడోరోజు నెట్‌వర్క్‌, ఐపీ అడ్రస్‌లపై ఆరా తీశారు. నాలుగోరోజు బ్యాంక్‌ ఖాతాలు, నెట్‌వర్క్‌పై విచారించారు. ఐదోరోజు వెబ్ సైట్, డొమైన్ నెట్వర్స్, ఐపీమాస్క్ తదితర అంశాలపై ఆరా తీశారు. అలాగే రవితో కలిసి అతని స్నేహితుడు ఇద్దరు కలిసి టైక్నికల్ ఆపరేషన్స్, డేటా హైడింగ్, సర్వర్ యాక్సెస్ తదితర అంశాల్లో పాల్గొన్నట్లు తేల్చుకున్నారు. బెట్టింగ్ యాప్‌ల ద్వారా భారీగా సంపాదించిన డబ్బులను..క్రిప్టో కరెన్సీ ద్వారా నిఖిల్ అనే స్నేహితుడికి పంపినట్లు గుర్తించారు. ఇక ఐబొమ్మ వెబ్‌సైట్లను మరో కంపెనీ నుంచి హోస్ట్ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. డొమైన్‌ను ‘ఎన్‌జల’ కంపెనీలో రిజిస్టర్ చేసి..కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రవి సినిమాలు పోస్ట్ చేసినట్టు చెబుతున్నారు. మరోవైపు ఇంకోకేసులో రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. ఇమంది రవిపై ఇప్పటి వరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మొత్తం 5 కేసులు నమోదు చేశారు. మిగిలిన 3 కేసులకు సంబంధించి కూడా పీటీ వారెంట్‌ దాఖలు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దోమలను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వం.. ఎందుకో తెలుసా ??

కేంద్రం సంచలన నిర్ణయం.. 2 కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు ??

TOP 9 ET News: జక్కన్న కిర్రాక్‌ ప్లాన్ !! ఈ సారి హాలీవుడ్‌ షేకవ్వడం పక్కా

Manchu Lakshmi: వాళ్ల వల్ల నేను అనుభవించిన బాధ.. నా ఒక్కదానికే తెలుసు

మంగ్లీని పచ్చి బూతులు తిడుతూ వీడియో.. దెబ్బకు జైల్లో పెట్టించిన సింగర్