AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonali Bendre: నా క్యాన్సర్ తగ్గుదలకు ప్రకృతి వైద్యమూ సాయపడింది

Sonali Bendre: నా క్యాన్సర్ తగ్గుదలకు ప్రకృతి వైద్యమూ సాయపడింది

Phani CH
|

Updated on: Nov 29, 2025 | 12:05 PM

Share

ఆటోఫేజీ అనేది మన శరీరంలోని కణాలు పాడైన భాగాలను రీసైకిల్ చేసుకునే సహజ ప్రక్రియ. ఉపవాసం, వ్యాయామం ద్వారా ఇది ఉత్తేజితమై రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుంది. కణాల స్వీయ శుభ్రత ద్వారా ఆరోగ్యం, దీర్ఘాయువుకు ఇది కీలకమైనది.

ఆటోఫేజీ అంటే మన శరీరం కొన్నిసార్లు ఆహారం తీసుకోకపోయినా, ఆకలిగా ఉన్నా తట్టుకోగల శక్తి. ఇది శరీరంలోని సహజ రీసైక్లింగ్ విధానం ద్వారా లభిస్తుందని జపాన్ శాస్త్రవేత్త యోషినోరి ఒహ్‌సుమి తన పరిశోధనలో కనుగొన్నారు. ఈ ప్రాసెస్ ప్రకారం.. ఆకలిగా ఉన్నప్పుడు లేదా ఏదైనా ఒత్తిడిని అనుభవిస్తున్నప్పుడు మన శరీరంలోని కణాలు తమలోని పాడైన భాగాలను రీసైక్లింగ్ చేసుకొని శక్తిని పొందుతాయి. ఆరోగ్యకరమైన కణ భాగాలను తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియను ‘సెల్ఫ్ ఈటింగ్’ అని కూడా అంటారు. ఇది శరీరానికి అతి ముఖ్యమైన రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది. ఆటోఫేజీ జరగకపోతే.. అంటే.. శరీరంలో కణాల రీసైక్లింగ్ సరిగ్గా పనిచేయకపోతే కూడా.. క్యాన్సర్, అల్జీమర్స్, పార్కిన్సన్స్, డయాబెటిస్, వృద్ధాప్యం వంటివి వేగంగా వస్తాయి. అందుకే అప్పుడప్పుడూ ఇది కూడా అవసరం. కణం తనలోని పాడైన భాగాలను తానే తినేయడం. శరీరంలోని ప్రతీ కణంలో ఉండే నేచురల్ “రీసైక్లింగ్ + క్లీనప్” వ్యవస్థ వంటిది. అందుకే అప్పుడప్పుడైనా ఆటోఫేజీ అవసరం. ఉపవాసం ఉండటం, ఒత్తిడిని అనుభవించడం, వ్యాయామాలు చేయడం వంటి పరిస్థితుల్లో ఇది యాక్టివేట్ అవుతుంది. ఆటోఫేజీతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ కణాల ప్రభావం తగ్గుతుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి మెదడు వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుంది. డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. వృద్ధాప్యం నెమ్మదిస్తుంది. ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్, కీటో డైట్, సాధారణంగా ప్రజలు అప్పుడప్పుడూ ఉండే ఉపవాసం వల్ల కూడా ఈ విధమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆటోఫేజీపై మాట్లాడి సోనాలి బింద్రె చిక్కుల్లో పడ్డారు. 2018లో ఆమె నాల్గవ దశ మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌ బారిన పడినా మనోధైర్యంతో చికిత్స తీసుకొని ఆ మహమ్మారి నుంచి బయటకు వచ్చి ఎంతోమందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు . తాను క్యాన్సర్‌ను జయించడానికి ప్రకృతి వైద్యం ఎంతో సాయపడిందన్నారు. ఈ వ్యాఖ్యలను కొందరు వైద్యులు తప్పు పట్టారు. ప్రకృతి వైద్యం క్యాన్సర్‌ను తగ్గిస్తుందని ఎక్కడా సరైన ఆధారాలు లేవంటూ విమర్శలు చేశారు. దీంతో సోనాలి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడూ డాక్టర్‌ని అని చెప్పలేదన్నారు. నిజాయితీగా ఆ మహమ్మారి వల్ల తాను పడిన బాధను ప్రజలతో పంచుకున్నట్లు వివరించారు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలున్న వారు చికిత్స తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పొరపాట్లు చేస్తున్నారా ?? ఫ్లైట్‌ మిస్‌ అవుతుంది జాగ్రత్త !!

మరో మూడురోజుల కస్టడీ.. ఐ బొమ్మ రవి ఇంతకీ హీరోనా ?? విలనా ??

దోమలను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వం.. ఎందుకో తెలుసా ??

కేంద్రం సంచలన నిర్ణయం.. 2 కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు ??

TOP 9 ET News: జక్కన్న కిర్రాక్‌ ప్లాన్ !! ఈ సారి హాలీవుడ్‌ షేకవ్వడం పక్కా