AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐ -బొమ్మ రవి బయోపిక్ ! అప్పుడే సినిమా మొదలెట్టారుగా

ఐ -బొమ్మ రవి బయోపిక్ ! అప్పుడే సినిమా మొదలెట్టారుగా

Phani CH
|

Updated on: Nov 29, 2025 | 4:30 PM

Share

"ఐ బొమ్మ రవి" పైరసీ కేసులో అరెస్ట్ అయ్యాడు. పదుల సంఖ్యలో వెబ్‌సైట్లు సృష్టించి వేల కోట్లు నష్టం కలిగించాడు. విచారణలో బెట్టింగ్, డేటా అమ్మకాలు, హవాలా వంటి అక్రమ వ్యాపారాల ద్వారా కోట్ల సంపాదన వెలుగులోకి వచ్చింది. పోలీసులు అరెస్ట్ చేసిన రవిపై "ఐ రవి" పేరుతో బయోపిక్ వస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి పేరు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో తెగ వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ అతని పేరు తెగ వినిపిస్తోంది. ఐ బొమ్మ, బప్పం టీవీ అంటూ పదుల సంఖ్యలో పైరసీ వెబ్ సైట్లు క్రియేట్ చేశాడు రవి. వాటిలో పైరసీ సినిమాలను అప్ లోడ్ చేసి సినిమా ఇండస్ట్రీకి వేలాది కోట్ల రూపాయల నష్టం కలిగించాడు. పైగా దమ్ముంటే పట్టుకోమని పోలీసులకు సవాల్ విసిరాడు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా ప్లాన్ తో రవిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అలాగే పైరసీ గుట్టు లాగేందుకు పోలీసులు కూడా అతనని విచారిస్తున్నారు. ఐ బొమ్మ రవి అరెస్ట్ పై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు చాలా మంచి పని చేశారంటూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అదే సమయంలో బయట, సోషల్ మీడియాలోనూ ఐ బొమ్మ రవికి చాలా మంది సపోర్టుగా నిలుస్తున్నారు. రవి కారణంగానే తాము ఇంట్లో ఫ్రీగా సినిమాలు చూశామని, అతను రియల్ హీరో అని, రాబిన్ హుడ్ అని బిరుదులు ఇచ్చేస్తున్నారు. అయితే పోలీసులు విచారణలో ఐబొమ్మ రవి గురించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఐ బొమ్మ ద్వారా రవి జనాలను బెట్టింగ్ యాప్స్ కి తరలించడం, మన డేటాను తీసుకొని డార్క్ వెబ్ కి అమ్మడం, హవాలా చేయడం.. లాంటి ఇల్లీగల్ పనులతో కోట్లు సంపాదించినట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఐబొమ్మ రవి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రానుందని అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడది నిజమైంది. తాజాగా ఐ బొమ్మ రవి బయోపిక్ ని ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. తేజ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థలో యూట్యూబ్ ఫేమ్ దొరసాయి తేజ హీరోగా నటిస్తూ దర్శకుడిగా ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఐ రవి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇమ్మడి రవి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ను ఇందులో చూపించనున్నారు. రవి బాల్యం, ఫ్యామిలీ, ఆటు పోట్లు, ఐ బొమ్మని ఎలా మొదలుపెట్టాడు, దానికి వచ్చిన ఆదరణ, ఇప్పుడు అరెస్ట్.. వంటి అంశాలతో ఐ బొమ్మ రవి బయోపిక్ ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎలా ఉంటుందో వేచి చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాస్ సిలిండర్ నుండి పాన్ కార్డ్ వరకు డిసెంబరులో జరిగే మార్పులు ఇవే

భక్తులతో కిక్కిరిసిన శబరిమల..12 రోజుల్లో 10 లక్షలమంది..

రూ. 10 కోట్లకు విల్లా.. హైదరాబాద్‌లో భారీ డిమాండ్‌

నిచ్చెన ఎక్కితేనే బ్యాంకు సేవలు.. డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా రిస్క్‌ చేస్తేనే

పెరుగుతున్న డయాబెటిస్‌ కేసులు.. స్కిన్‌ క్రీమ్‌ రూపంలో ఇన్సులిన్‌