నిచ్చెన ఎక్కితేనే బ్యాంకు సేవలు.. డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా రిస్క్ చేస్తేనే
ఒడిశాలోని భద్రక్ జిల్లా ఎస్‌బీఐ శాఖ వద్ద అక్రమణల తొలగింపులో భాగంగా మెట్లు కూల్చివేయబడ్డాయి. దీంతో కస్టమర్లు, సిబ్బంది మొదటి అంతస్తులోని బ్యాంకులోకి వెళ్లడానికి నిచ్చెనను ఉపయోగించాల్సి వచ్చింది. ఈ వింత పరిస్థితి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నోటీసులను పట్టించుకోని భవన యజమాని నిర్లక్ష్యమే దీనికి కారణం. ప్రస్తుతం స్టీల్ మెట్లు ఏర్పాటు చేశారు.
ఎస్‌బీఐ సేవలపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, రీల్స్ వైరల్ అవుతుంటాయి. ఈ బ్యాంకులో సర్వీస్ పొందాలంటే ఎంతో సహనం ఉండాలనే విమర్శ కూడా ఉంది. ఈ విమర్శలను నిజం చేస్తూ తాజాగా ఒడిశాలోని భద్రక్ జిల్లా ఎస్‌బీఐలో అలాంటి పరిస్థితి కనిపించింది. ఈ బ్రాంచ్‍లో కస్టమర్లు డబ్బులు వేయాలన్నా, తీసుకోవాలన్నా నిచ్చెన ద్వారా ఫస్ట్ ఫ్లోర్‍కు చేరుకోవాల్సిందే. అలా రిస్క్ చేస్తేనే ఈ బ్రాంచ్‍లో లావాదేవీలు సాగించే పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. నవంబర్ 20, 21 తేదీలలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. రోడ్డును ఆక్రమించి ఉన్న షాపులు , ఇళ్లు, వాణిజ్య సముదాయాలను అధికారులు పూర్తిగా నేలమట్టం చేసారు. ఎస్‍బీఐ బ్రాంచ్ ఉన్న భవనం మెట్లను కూడా అధికారులు తొలగించారు. దాంతో మొదటి అందస్తులో ఉన్న బ్రాంచ్‍కు చేరుకునేందుకు బ్యాంకు సిబ్బందితో పాటు కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అత్యవసరంగా డబ్బులు విత్ డ్రా చేసుకుందామని వచ్చిన కస్టమర్లు బ్యాంకు లోపలికి వెళ్లేందుకు మెట్ల మార్గం లేక షాకయ్యారు. దాంతో ఓ ట్రాక్టర్ టాప్‌పై ఓ నిచ్చెనను ఏర్పాటు చేసుకుని దాని సహాయంతో బ్యాంకు లోపలికి వెళ్లి వచ్చేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. రెండు రోజుల పాటు ఇలాగే సాగింది. బుధవారం ఆ భవనం యజమాని స్టీల్ మెట్లను ఏర్పాటు చేయించాడు. దీంతో బ్యాంకులోకి సాధారణంగా వెళ్లి రాగలుగుతున్నారు. ఆక్రమణలకు సంబంధించి భవనాల యజమానులకు ఇదివరకే అనేక సార్లు నోటీసులు అందించామని సంబంధిత అధికారులు తెలిపారు. కూల్చివేతలకు రెండు రోజుల ముందు బహిరంగ ప్రకటన కూడా చేశామని దీంతో చాలా మంది దుకాణాదారులు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించుకున్నారని చెప్పారు. కానీ కొంత మంది యజమానులు మాత్రం ఈ హెచ్చరికలను పట్టించుకోలేదని అందులో ఎస్‍బీఐ బ్రాంచ్ ఉన్న భవనం యజమాని కూడా ఉన్నారని అన్నారు. దీంతో సబ్-కలెక్టర్, తహశీల్దార్, ఇతర ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేతలు చేపట్టామన్నారు అధికారులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెరుగుతున్న డయాబెటిస్ కేసులు.. స్కిన్ క్రీమ్ రూపంలో ఇన్సులిన్
Pit Bull: పిట్ బుల్స్ దాడిలో యువతి మృతి
Dhoni: కోహ్లీ కోసం డ్రైవర్‌గా మారిన ధోనీ..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
సంక్రాంతి ఎఫెక్ట్.. హైదరాబాద్- వైజాగ్ బస్ టికెట్.. రూ. 7000
Sonali Bendre: నా క్యాన్సర్ తగ్గుదలకు ప్రకృతి వైద్యమూ సాయపడింది
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

