AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhoni: కోహ్లీ కోసం డ్రైవర్‌గా మారిన ధోనీ..ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ

Dhoni: కోహ్లీ కోసం డ్రైవర్‌గా మారిన ధోనీ..ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ

Phani CH
|

Updated on: Nov 29, 2025 | 12:14 PM

Share

ఎంఎస్ ధోనీ తన కారులో విరాట్ కోహ్లిని రాంచీలోని తన ఇంటికి తీసుకెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. రాంచీలో జరగనున్న వన్డే మ్యాచ్ కోసం కోహ్లి వచ్చిన నేపథ్యంలో ధోనీ ఈ ఆతిథ్యం ఇచ్చాడు. వారిద్దరి అనుబంధాన్ని గుర్తు చేస్తూ, అభిమానులను ఈ పునఃకలయిక ఆనందంలో ముంచెత్తింది. ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఎంఎస్ ధోనీ , విరాట్ కోహ్లిని విడివిడిగా చూస్తేనే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతారు. అదే ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉంటే.. అది కూడా పక్కపక్కన, ఒకే కారులో కూర్చుంటే. అంతేకాదు ధోనీ డ్రైవ్ చేస్తుంటే కోహ్లి పక్క సీటులోనే ఉంటే ఇక మామూలుగా ఉండదుగా. సరిగ్గా అలాంటిదే జరిగింది. మహేంద్ర సింగ్ ధోనీ తన కారు డ్రైవ్ చేస్తూ, పక్క సీటులో కోహ్లి ప్రయాణించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాంటి హంగామా లేకుండా, ధోని డ్రైవింగ్ సీట్‌లో, కోహ్లీ పక్కన కూర్చుని ప్రయాణించడం..పాత జ్ఞాపకాలను, వారిద్దరి మధ్య అనుబంధాన్ని గుర్తు చేస్తోంది. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓడిన భారత జట్టు, నవంబర్ 30 నుంచి మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడనుంది. మొదటి వన్డే రాంఛీలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత ప్లేయర్లు, రాంచీకి చేరుకున్నారు. చాలా రోజుల తర్వాత రాంఛీలో మ్యాచ్ ఆడుతోంది భారత జట్టు. దీంతో రాంఛీకి వచ్చిన భారత ప్లేయర్లను, తన ఇంటికి విందుకి ఆహ్వానించాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లీని ధోనీ స్వయంగా తన కారులో ఇంటికి తీసుకెళ్లడం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ఫ్యాన్స్‌ తెగ షేర్‌ చేస్తున్నారు.వైరల్‌ అవుతున్న ఈ వీడియోకు ఈ వీడియోకు రీ యూనియన్ ఆఫ్ ది ఇయర్ అని క్యాప్షన్ పెట్టడంతో మరింత హైలెట్ అయింది. విరాట్ కోహ్లి టీ20లతో పాటు టెస్టులకూ గుడ్ బై చెప్పడంతో కేవలం వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగుతున్నాడు. దాంతో ఫ్యామిలీని పూర్తిగా లండన్‌కు మార్చేసిన కోహ్లి ఎప్పుడైనా వన్డే సిరీస్ ఉంటేనే భారత్‌కు వస్తున్నాడు. సౌతాఫ్రికాతో ఈ నెల 30 నుంచి వన్డే సిరీస్ మొదలవ్వనుండటంతో విరాట్ కోహ్లి భారత్‌కు చేరుకున్నాడు. మొదటి వన్డే ధోనీ సొంతగడ్డ రాంచీలోనే జరగనుంది. దాంతో విరాట్ కోహ్లికి ధోనీ స్వాగతం పలికాడు. రాంచీ చేరుకున్న కోహ్లిని స్వయంగా ధోనీనే వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సంక్రాంతి ఎఫెక్ట్.. హైదరాబాద్- వైజాగ్ బస్ టికెట్.. రూ. 7000

Sonali Bendre: నా క్యాన్సర్ తగ్గుదలకు ప్రకృతి వైద్యమూ సాయపడింది

ఈ పొరపాట్లు చేస్తున్నారా ?? ఫ్లైట్‌ మిస్‌ అవుతుంది జాగ్రత్త !!

మరో మూడురోజుల కస్టడీ.. ఐ బొమ్మ రవి ఇంతకీ హీరోనా ?? విలనా ??

దోమలను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వం.. ఎందుకో తెలుసా ??