సంక్రాంతి ఎఫెక్ట్.. హైదరాబాద్- వైజాగ్ బస్ టికెట్.. రూ. 7000
సంక్రాంతి పండగ రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఛార్జీలను అసాధారణంగా పెంచేశాయి. కొన్ని మార్గాల్లో విమాన టికెట్ ధరలను మించి బస్సు ఛార్జీలు వసూలు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వం ప్రత్యేక బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునేవారికి ఇప్పటి నుంచే ప్రైవేట్ ట్రావెల్స్ చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో టికెట్లు ఇప్పటికే పూర్తిగా నిండిపోవడంతో ప్రైవేటు ఆపరేటర్లు ఇదే అదునుగా ఛార్జీలను భారీగా పెంచేశారు. కొన్ని మార్గాల్లో విమాన టికెట్ ధరలను మించి బస్సు చార్జీలు ఉండటం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. సంక్రాంతి పండగ జనవరి 13, 14 తేదీల్లో రానుండగా దానికి ముందు వారాంతం కలిసి రావడంతో జనవరి 9, 10 తేదీల్లో ప్రయాణాలకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి వెళ్లే బస్సుల టికెట్ ధరలు ఆకాశాన్నంటాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో టికెట్ ధర సుమారు రూ.1,880 ఉండగా, ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో ఇదే ధర రూ.5,000 నుంచి రూ.6,999 వరకు పలుకుతోంది. ఇదే మార్గంలో జనవరి 9న విమాన టికెట్ ధర సుమారు రూ.6,500 మాత్రమే ఉండటం ఆశ్చర్యకరం. అంటే బస్సు ప్రయాణం విమానం కంటే ఖరీదుగా మారింది. ఈ లెక్కన ఐదుగురు సభ్యులున్న ఒక కుటుంబం ప్రైవేట్ బస్సులో విశాఖపట్నం వెళ్లాలంటే కేవలం టికెట్లకే రూ.30,000 నుంచి రూ.35,000 వరకు ఖర్చు చేయాల్సిన దారుణ పరిస్థితి ఉంది. పండగ రద్దీని తట్టుకునేలా ప్రభుత్వం ప్రత్యేక బస్సులు, రైళ్లను ప్రకటించకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ ఆపరేటర్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఈ దోపిడీని అరికట్టేందుకు రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆర్టీసీ స్పందించి రద్దీకి తగినట్లుగా బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sonali Bendre: నా క్యాన్సర్ తగ్గుదలకు ప్రకృతి వైద్యమూ సాయపడింది
ఈ పొరపాట్లు చేస్తున్నారా ?? ఫ్లైట్ మిస్ అవుతుంది జాగ్రత్త !!
మరో మూడురోజుల కస్టడీ.. ఐ బొమ్మ రవి ఇంతకీ హీరోనా ?? విలనా ??
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

