AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం సంచలన నిర్ణయం.. 2 కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు ??

కేంద్రం సంచలన నిర్ణయం.. 2 కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు ??

Eswar Chennupalli
| Edited By: Phani CH|

Updated on: Nov 29, 2025 | 12:38 PM

Share

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో UIDAI దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా మరణించినవారి ఆధార్ నంబర్లను తొలగించింది. మోసాలను అరికట్టడానికి, ఆధార్ డేటాబేస్ ఖచ్చితత్వాన్ని కాపాడటానికి ఈ చర్య చేపట్టింది. మరణాలను నివేదించడానికి myAadhaar పోర్టల్‌లో కొత్త సౌకర్యం ప్రారంభించబడింది. పొరపాటున తొలగించిన ఆధార్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా మంది ఆధార్ నంబర్లను UIDAI తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వేరేవారు వాడకుండా కేవలం మరణించిన వారి ఆధార్ నంబర్లను డేటా బేస్ నుంచి రిమూవ్ చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, ప్రజా పంపిణీ వ్యవస్థ, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం, వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి మరణించిన వ్యక్తుల డేటాను ఇటీవల UIDAI సేకరించింది. అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. కొంతమంది మరణించినవారి ఆధార్ కార్డులను వేరే పనులకు ఉపయోగించుకునే అవకాశముంది. దీంతో పాటు ఆధార్ డేటాబేస్ నిరంతర ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి దేశవ్యాప్తంగా మరణించిన వ్యక్తుల ఆధార్ నంబర్లను తొలగించినట్లు అధికారులు స్పష్టం చేశారు. తొలగించిన ఆధార్ నంబర్‌ను మరొక వ్యక్తికి తిరిగి కేటాయించబడదని అధికారులు స్పష్టం చేశారు. మరణించిన వ్యక్తి ఆధార్ ను మోసపూరితంగా కొంతమంది సంక్షేమ పథకాల కోసం ఉపయోగించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది.అందుకే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు UIDAI అధికారులు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్న రాష్ట్రాల్లో మరణాలను నమోదు చేసేందుకు myAadhaar పోర్టల్‌లో కుటుంబసభ్యులు తమ ఇంట్లోని వ్యక్తులు ఎవరైనా మరణిస్తే నివేదించే సౌకర్యాన్ని UIDAI ప్రారంభించింది. ఎప్పటికప్పుడు మరణించిన వ్యక్తుల డేటాను UIDAI తొలగిస్తుంది. గతంలో కూడా పలుమార్లు ఇలా తొలగించింది.దీని ద్వారా ఆధార్ డేటాబేస్‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నారు. అయితే కొంతమంది ఆధార్ కార్డులు గతంలో మరణించినట్లు తప్పుగా నమోదు కావడంతో డియాక్టివేట్ చేశారు. ఈ సారి అలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ పొరపాటున ఎవరిదైనా తొలగిస్తే మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని కోసం UIDAI ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడు మీది మళ్లీ యాక్టివేట్ అవుతుంది. అయితే ఒకసారి 2 కోట్ల మంది ఆధార్ నెంబర్లను తొలగించడం ఇదే తొలిసారి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: జక్కన్న కిర్రాక్‌ ప్లాన్ !! ఈ సారి హాలీవుడ్‌ షేకవ్వడం పక్కా

Manchu Lakshmi: వాళ్ల వల్ల నేను అనుభవించిన బాధ.. నా ఒక్కదానికే తెలుసు

మంగ్లీని పచ్చి బూతులు తిడుతూ వీడియో.. దెబ్బకు జైల్లో పెట్టించిన సింగర్

Hema Chandra: విడాకుల పై ప్రశ్నించినందుకు.. యాంకర్‌కు ఇచ్చిపడేసిన సింగర్ హేమచంద్ర

Cyclone Ditwah: దూసుకొస్తున్న ‘దిట్వా’.. టార్గెట్‌ ఏపీ, తమిళనాడు

Published on: Nov 29, 2025 11:27 AM