AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hema Chandra: విడాకుల పై ప్రశ్నించినందుకు.. యాంకర్‌కు ఇచ్చిపడేసిన సింగర్ హేమచంద్ర

Hema Chandra: విడాకుల పై ప్రశ్నించినందుకు.. యాంకర్‌కు ఇచ్చిపడేసిన సింగర్ హేమచంద్ర

Phani CH
|

Updated on: Nov 29, 2025 | 10:51 AM

Share

ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకుల వార్తలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. అధికారికంగా ప్రకటించకపోయినా, వారి వేర్పాటు గురించి పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హేమచంద్ర ఈ వార్తలపై సీరియస్‌గా స్పందిస్తూ, "నాకు పనికిరాని విషయాలపై స్పందించాల్సిన అవసరం లేదు" అని ఖరాకండిగా చెప్పారు.

ప్రేమించి పెళ్లి చేసకున్న టాలీవుడ్ సెలబ్రిటీల్లో హేమ చంద్ర, శ్రామణ భార్గవి జోడీ ఒకటి. ట్యాలెంటెడ్ సింగర్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరూ.. పెద్దలను ఒప్పించి మరీ.. 2013లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ పాప కూడా పుట్టింది. అయితే కొన్నాళ్ల పాటు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసిన వీరిద్దరూ.. ఉన్నట్టుండి వేరు ఇంట్లోకి షిప్ట్ అయ్యారు. దీంతో ఇద్దరూ విడిపోయారనే టాక్ బయటికి వచ్చింది. కానీ అధికారికంగా మాత్రం ఈ విషయాన్ని ఇద్దరూ ప్రకటించలేదు. అఫీషియల్ అనౌన్స్‌ మెంట్ లేకుండానే ఎవరికి వారు నివసిస్తూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కానీ సోషల్ మీడియాలో వీరిద్దరూ పెట్టే పోస్టుల వల్ల మాత్రం తమ విడాకుల గురించి హింట్ అయితే ఇచ్చారు. కట్ చేస్తే.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వచ్చిన సింగర్ హేమ చంద్ర.. తన విడాకుల విషయం పై కాస్త సీరియస్‌ కామెంట్స్ చేశారు. విడాకుల వార్తలపై తానెందుకు స్పందిచాలంటూ హోస్ట్ కే కౌంటరేశాడు. వార్తలు ఏదైనా సరే అది నిజమా కాదా పక్కన పెడితే దానివల్ల నీకు ఏమైనా పనికొస్తదా, అది తెలుసుకోవడం వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా అంటే చెప్పు చెప్తా… అంటూ… విడాకుల పై ప్రశ్నించిన హెస్ట్ కు చిన్న క్లాస్ పీకాడు హేమ చంద్ర. అంతేకాదు తన పై వచ్చే కామెంట్స్ ని తాను కేర్ చెయ్యనని.. అవి తనను ఎఫెక్ట్ చెయ్యవని.. వాటిపై తాను రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు. చాలా మంది ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండాలని అనుకుంటారు.. కానీ తాను ఆ టైప్ కాదన్నాడు హేమ చంద్ర. మాట్లాడితే కనీసం ఒకరైనా ఇన్ స్పైర్ అవ్వాలి. బేవర్స్ మాటలకు సమయం లేదంటూ తన విడాలకు మ్యాటర్‌ను పక్కకు నెట్టేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Cyclone Ditwah: దూసుకొస్తున్న ‘దిట్వా’.. టార్గెట్‌ ఏపీ, తమిళనాడు

Bigg Boss Telugu 9: డేంజర్‌ జోన్ లో.. సుమన్ శెట్టి