Cyclone Ditwah: దూసుకొస్తున్న ‘దిట్వా’.. టార్గెట్ ఏపీ, తమిళనాడు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిట్వా తుఫాన్ ఏపీ, తమిళనాడు తీరాలకు ముంచుకొస్తోంది. శనివారం నుండి తీవ్ర రూపం దాల్చి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో సహా అనేక ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు తుఫాన్ ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక తుఫాన్ ముప్పు తప్పిందనుకుంటే మరొకటి ముంచుకొస్తోంది. మొన్న మొంథా.. నిన్న సెన్యార్, ఇప్పుడు దిట్వా. ఇలా వరుస తుఫాన్లు వణుకు పుట్టిస్తున్నాయి. దీని టార్గెట్ కూడా ఏపీనే. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది. ఈ తుఫాన్‌కు దిట్వాగా నామకరణం చేశారు. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు గంటకు 15 కి.మీ వేగంతో తుఫాన్ కదులుతోంది. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం ఆనుకుని తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరే అవకాశముంది. శనివారం నుంచి ఈ తుఫాను తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని.. దీంతో తమిళనాడుతోపాటు ఆంధ్రాలోని దక్షిణ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని అన్ని ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈనెల 30న ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశముందని రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆయా జిల్లాల్లో 20 సెం.మీకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్ హెచ్చరికలు వినిపించడంతో సముద్ర తీర ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ తుఫాన్ తమ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

