AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెరుగుతున్న డయాబెటిస్‌ కేసులు.. స్కిన్‌ క్రీమ్‌ రూపంలో ఇన్సులిన్‌

పెరుగుతున్న డయాబెటిస్‌ కేసులు.. స్కిన్‌ క్రీమ్‌ రూపంలో ఇన్సులిన్‌

Sudhir Chappidi
| Edited By: Phani CH|

Updated on: Nov 29, 2025 | 1:57 PM

Share

మధుమేహ రోగులకు తీపి కబురు! ఇంజెక్షన్ల బాధ నుండి ఉపశమనం కలిగించే ఇన్సులిన్ స్కిన్ క్రీమ్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది చర్మం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ప్రస్తుతం జంతువులపై విజయవంతంగా పరీక్షించారు. క్లినికల్ ట్రయల్స్ పూర్తయితే, 5-10 ఏళ్లలో ఇది అందుబాటులోకి వచ్చి, కోట్లాది మంది మధుమేహ బాధితులకు గొప్ప ఆశాకిరణంగా నిలుస్తుంది.

మధుమేహం చాప కింద నీరులా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. మధుమేహుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మధుమేహం చాలా మందిలో కనిపిస్తోంది. షుగర్‌ జబ్బు కట్టడికి మనమంతా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మధుమేహ నియంత్రణకు ఆధునిక పరీక్షలు, మందులు, ఇన్సులిన్‌.. ఇలా అన్నీ అందుబాటులో ఉన్నాయి. అయితే అందరూ వాటిని వినియోగించుకోగలుగుతున్నారా? అంటే లేదనే సమాధానమే వస్తోంది. డయాబెటిస్‌ కేర్‌ అనేది చాలా మందికి ఇంకా సుదూరంగానే ఉందని చెబుతున్నారు డాక్టర్లు. మధుమేహం అనేక అవయవాలను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి. ప్రపంచంలో మధుమేహ బాధితుల్లో 17 శాతం మంది భారతీయులే. 25 నుంచి 74 ఏళ్ల మధ్య గల వయస్సు వారిలో ప్రధానంగా కిడ్నీలు, నరాలు, కంటి చూపుపై డామేజ్‌ జరగవచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రక్తంలో చక్కెర, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ స్థాయిలను అదుపులో పెట్టుకోవడం, దూమపానానికి దూరంగా ఉండటం, వ్యాయామం చేయడం వంటితో ఈ సమస్య నుంచి దూరం కావచ్చని అంటున్నారు. మధుమేహ రోగులు కొందరు రోజుకు మూడుసార్లు కూడా ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ తీసుకోవాల్సి వస్తుంది. వీరి బాధకు గొప్ప ఉపశమనాన్ని కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇన్సులిన్‌ను శరీరానికి రాసుకొనే స్కిన్‌ క్రీమ్‌ రూపంలో రూపొందించామని అంటున్నారు. ఈ నూతన ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు ‘నేచర్‌’ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఈ పాలిమర్‌ ఇన్సులిన్‌ చర్మం ద్వారా రక్త ప్రవాహంలోకి దూసుకెళ్లగలదని అంటున్నారు. పరిశోధన సందర్భంగా ఎలుకలు, పందులపై ఈ స్కిన్‌క్రీమ్‌ను ప్రయోగించినప్పుడు.. వాటి శరీరంలో చక్కెర స్థాయి తగ్గిపోయిందని తెలిపారు. ఇంజెక్షన్లు చేసే పనిని ఈ స్కిన్‌క్రీమ్‌ విజయవంతంగా పూర్తి చేసిందని, పైగా వాటి చర్మానికి దురద వంటి సమస్యలు రాలేదని అన్నారు. ఎంతో సురక్షితమైన ఈ స్కిన్‌క్రీమ్‌తో శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చని వివరించారు. క్లినికల్‌ ట్రయల్స్‌ గనుక త్వరగా ప్రారంభమై.. ప్రయోగాలు స్థిరంగా ముందుకు సాగితే.. ఐదు నుంచి పదేళ్ల కాలంలో ఈ స్కిన్‌ క్రీమ్‌ మెడికల్ షాపుల్లో అందుబాటులోకి వస్తుందని వివరించారు. ప్రపంచంలో కోట్లాది సంఖ్యలో ఉన్న మధుమేహ బాధితులకు ఇది నిజంగా శుభవార్తే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pit Bull: పిట్‌ బుల్స్‌ దాడిలో యువతి మృతి

Dhoni: కోహ్లీ కోసం డ్రైవర్‌గా మారిన ధోనీ..ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ

సంక్రాంతి ఎఫెక్ట్.. హైదరాబాద్- వైజాగ్ బస్ టికెట్.. రూ. 7000

Sonali Bendre: నా క్యాన్సర్ తగ్గుదలకు ప్రకృతి వైద్యమూ సాయపడింది

ఈ పొరపాట్లు చేస్తున్నారా ?? ఫ్లైట్‌ మిస్‌ అవుతుంది జాగ్రత్త !!

Published on: Nov 29, 2025 12:26 PM