AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భక్తులతో కిక్కిరిసిన శబరిమల..12 రోజుల్లో 10 లక్షలమంది..

భక్తులతో కిక్కిరిసిన శబరిమల..12 రోజుల్లో 10 లక్షలమంది..

Phani CH
|

Updated on: Nov 29, 2025 | 12:42 PM

Share

శబరిమల మకరవిళక్కు సీజన్‌లో అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. కేవలం 12 రోజుల్లో 10 లక్షల మందికి పైగా దర్శించుకున్నారు, 15 గంటల నిరీక్షణ సమయం పడుతోంది. రికార్డు స్థాయిలో రద్దీ పెరగడంతో కేరళ హైకోర్టు జోక్యం చేసుకుని, స్పాట్ బుకింగ్‌లను పరిమితం చేయడంతో పాటు భద్రత పెంచాలని ఆదేశించింది. ఇప్పటివరకు రూ. 60 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.

శబరిమలలో మకరవిళక్కు సీజన్‌ కొనసాగుతోంది. శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మండల పూజలనిమిత్తం నవంబరు 16న ఆలయద్వారాలు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో 12రోజుల్లో 10లక్షల మంది దర్శం చేసుకోవడం రికార్డు సృష్టిస్తోంది. శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. గంటగంటకి అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో అయ్యప్పలతో శబరిమల కిక్కిరిసిపోతోంది. ఫలితంగా.. అయ్యప్ప దర్శనానికి 15గంటలకి పైగా సమయం పడుతోంది. ఈ నెల 16న దర్శనాలు ప్రారంభం కాగా.. 12వ రోజుకి 10,29,451 మంది భక్తులు అయ్యప్పను దర్శనం చేసుకున్నారు. గురువారం 79వేల 707 మంది అప్పయ్యస్వామి సేవలో పాల్గొన్నారు. అయ్యప్ప భక్తులు పోటెత్తుతుండడంతో ఈ సీజన్‌లో ఇప్పటికే పది లక్షలు దాటడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆలయ రద్దీకి అనుగుణంగా పంబా నుండి భక్తులను బయటకు పంపుతున్నారు. మండల పూజ సీజన్‌లో భాగంగా ఈ నెల 16న శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. అయితే.. రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తుండడంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేరళ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే.. రోజూవారీ స్పాట్ బుకింగ్స్ ఐదు వేలకు పరిమిత చేశారు అధికారులు. భక్తుల రద్దీ ఆధారంగా భద్రత పెంచుకోవాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. మండల మకరవిళక్కు సీజన్‌లో శబరిమలలో భక్తుల సంఖ్య 10లక్షలు దాటగా.. ఆదాయం 60 కోట్లు క్రాస్‌ అయింది. మరోవైపు.. అయ్యప్ప భక్తుల దర్శనాలకు ఇబ్బందులు కలగకుండా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఏర్పా్ట్లు చేసింది. ఆన్‌లైన్ స్లాట్లు, స్పాట్ బుకింగ్స్ వెంటవెంటనే జరిగిపోతున్నాయి. పంపా బేస్ దగ్గర నుంచే భక్తులు కిక్కిరిసిపోతుండడంతో అయ్యప్ప సన్నిధానం చేరుకునేందుకు గంటల టైమ్ పడుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ. 10 కోట్లకు విల్లా.. హైదరాబాద్‌లో భారీ డిమాండ్‌

నిచ్చెన ఎక్కితేనే బ్యాంకు సేవలు.. డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా రిస్క్‌ చేస్తేనే

పెరుగుతున్న డయాబెటిస్‌ కేసులు.. స్కిన్‌ క్రీమ్‌ రూపంలో ఇన్సులిన్‌

Pit Bull: పిట్‌ బుల్స్‌ దాడిలో యువతి మృతి

Dhoni: కోహ్లీ కోసం డ్రైవర్‌గా మారిన ధోనీ..ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ