Tollywood: తండ్రికి తగ్గ తనయుడు.. ఈ చిరుతలాంటి చిన్నోడు ఆ స్టార్ హీరో కుమారుడు.. ఎవరో తెలుసా ?..

ఇప్పటికే ఆర్. మాధవన్ తనయుడు వేదాంత్ స్పోర్ట్స్ లో స్విమ్మింగ్ పోటిల్లో ఎన్నో పతకాలను గెలుచున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరో కొడుకు ఫుట్ బాల్ లో రాణిస్తున్నాడు.  పైన ఫోటోలో ఉన్న చిన్నోడు.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి బంగారు పతకం సాధించాడు. చిరుతలాంటి వేగంతో ఈ చిచ్చరపిడుగు మైదానంలో ఫుట్ బాల్ ఆడుతున్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో తండ్రికి తగ్గ తనయుడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Tollywood: తండ్రికి తగ్గ తనయుడు.. ఈ చిరుతలాంటి చిన్నోడు ఆ స్టార్ హీరో కుమారుడు.. ఎవరో తెలుసా ?..
Actor Son
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 17, 2023 | 8:46 PM

హీరో తనయుడు హీరో కావడం చూస్తుంటాం.. ఒకప్పుడు ఇండస్ట్రీలో వారసత్వం ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరో కొడుకు హీరో కావాలని అనుకోవడం లేదు. కొందరు దర్శకులుగా.. మరికొందరు నిర్మాతలుగా రాణిస్తున్నారు. ఇక ఇప్పుడిప్పుడే స్టార్ హీరోస్ కుమారులు ఇతర రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఆర్. మాధవన్ తనయుడు వేదాంత్ స్పోర్ట్స్ లో స్విమ్మింగ్ పోటిల్లో ఎన్నో పతకాలను గెలుచున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరో కొడుకు ఫుట్ బాల్ లో రాణిస్తున్నాడు.  పైన ఫోటోలో ఉన్న చిన్నోడు.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి బంగారు పతకం సాధించాడు. చిరుతలాంటి వేగంతో ఈ చిచ్చరపిడుగు మైదానంలో ఫుట్ బాల్ ఆడుతున్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో తండ్రికి తగ్గ తనయుడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పైన ఫోటోలో కనిపిస్తోన్న ఆ చిన్నోడు ఎవరో తెలుసా. సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరో తనయుడు. ఈ కుర్రాడి పేరు అద్విక్ అజిత్ కుమార్. పేరులో తండ్రిపేరు కలిసిపోయింది కదూ.. అవును.. అతను కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, షాలిని దంపతుల ముద్దుల తనయుడు అద్విక్. తండ్రిలాగే మల్టీటాలెంటెడ్. చిన్నప్పటినుంచి ఫుట్ బాల్ ఆసక్తి ఉన్న అద్విక్.. తాజాగా గోల్డ్ మెడల్ సాధించాడు.

అజిత్ కుమార్ 1993లో అమరావతి సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. అప్పట్లో అతను అమ్మాయిల ఫేవరేట్ హీరో.. డ్రీమ్ బాయ్ అంటే అతిశయోక్తి కాదు. మొదట్లో అజిత్ యాక్షన్ చిత్రాలలో కాకుండా రొమాంటిక్ , సాఫ్ట్ జానర్ చిత్రాలలో నటించేవారు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అజిత్.. అటు కార్, బైక్ రేసింగ్‌లలో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు ఎన్నో రేసుల్లో పాల్గొన్నాడు. అంతే కాకుండా అజిత్ ఇటీవల వీనస్ మోటార్ సైకిల్ కంపెనీతో కలిసి టూరింగ్ బిజినెస్ ప్రారంభించాడు. అలాగే అజిత్ కు విమానం నడపడం కూడా చాలా ఇష్టం. ఇప్పటికే చాలాసార్లు విమానం నడిపారు. ఇవే కాకుండా గన్ షూటింగ్‏లోనూ ప్రతిభావంతుడు. ఇప్పటికే సొంతంగా మొబైల్ ఉపయోగించడు. అలాగే తన సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటాడు. కానీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంటారు. ఇప్పటికీ అజిత్ కు భారీగానే ఫాలోయింగ్ ఉంది.

Ajith Kumar Family

Ajith Kumar Family

అమర్కలం సినిమా చిత్రీకరణ సమయంలో తన సహనటి షాలినిని , అజిత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు అనోష్క, ఆద్విక్. సోషల్ మీడియాలో అజిత్ కు ఖాతాలు లేవు. కానీ ఆయన సతీమణి మాత్రం ట్విట్టర్ వేదికగా అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫోటోస్ పంచుకుంటారు. తాజాగా అద్విక్ పుట్ బాల్ ఆటలో బంగారు పతకం సాధించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అద్విక్ స్పోర్ట్స్ లో మాత్రం రికార్డు సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా ఈ చిన్నారికి ఫుట్‌బాల్‌పై ఆసక్తి ఎక్కువ. ఇటీవల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అద్విక్ బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అజిత్ విడతల షూటింగ్‌లో అజర్‌బైజాన్‌లో ఉన్నారు. ఈ చిత్రానికి దర్శకుడు మిజిల్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత అజిత్ జోడిగా త్రిష నటిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.