Sridevi: అతిలోక సుందరి ఆఖరి కోరిక ఏంటో తెలుసా? శ్రీదేవి చనిపోయాక అలా చేశారా?

అతిలోక సుందరి. లెజెండరీ నటి శ్రీదేవి సుమారు 8 సంవత్సరాల క్రితం 2018లో కన్నుమూశారు. ఈ విషాదాన్ని ఇప్పటికీ చాలా మంది నమ్మలేకపోతున్నారు. అయితే ఈ ఘటన జరగడానికి ముందే పలు ఇంటర్వ్యూల్లో శ్రీదేవి తన ఆఖరి కోరిక గురించి చెప్పుకొచ్చింది.

Sridevi: అతిలోక సుందరి ఆఖరి కోరిక ఏంటో తెలుసా? శ్రీదేవి చనిపోయాక అలా చేశారా?
Sridevi

Updated on: Sep 02, 2025 | 10:17 PM

సుమారు 300కు పైగా సినిమాల్లో నటించి అతిలోక సుందరిగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీదేవి.  బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆమె తర్వాత కాలంలో హీరోయిన్ గా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలింది. తెలుగుతో పాటు హిందీ భాషల్లోనూ వందలాది సినిమాల్లో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే 54 ఏళ్ల వయసులోనే లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయి సినీ అభిమానులను విషాదంలో నెట్టేసింది. శ్రీదేవి మరణంతో ఆమె కుటుంబంతో పాటు సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. శ్రీదేవి 2018 ఫిబ్రవరి లో కన్నుమూసింది. తన మేనల్లుడి వివాహం కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడి ఒక హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే ఇంతటి విషాదంలోనూ శ్రీదేవి కుటుంబ సభ్యులు ఆమె ఆఖరి కోరికను నెరవేర్చారు. విషాదం జరగడానికి ముందే శ్రీదేవి తన చివరి కోరిక గురించి చాలా ఇంటర్వ్యూలలో మాట్లాడింది. ‘ నేను చనిపోయాక అంతా తెలుపు రంగుతో అంత్య క్రియలు జరగాలన్నది నా ఆఖరి కోరికఅని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది శ్రీదేవి.

శ్రీదేవికి తెల్లని రంగు అంటే ఎంతో ఇష్టం. ఆమె నటించిన సినిమాల్లో మరీ ముఖ్యంగా పాటల్లో ఆమెకి తెలుపు రంగుపై ఉన్న ప్రేమ అర్ధమవుతుంది. క్రమంలోనే శ్రీదేవి కూడా తన బంధుమిత్రులతో నేను మరణించిన తర్వాత అంతా తెలుపు రంగుతో అంత్యక్రియలు జరపాలని కోరుకుందట. దానికి అనుగుణంగానే శ్రీదేవి అంత్యక్రియలకు చాలామంది తెల్లటి పూలతోనే వచ్చారట. శ్రీదేవి మరణం తరువాత, ఆమె మృతదేహాన్ని ఉంచిన స్థలాన్ని కూడా తెల్ల గులాబీలు, తెల్ల మల్లెలతో అలంకరించారు. చివరకు శ్రీదేవిని అంత్యక్రియలకు తీసుకెళ్లే వాహనం కూడా తెలుపు రంగు పువ్వులతో రెడీ చేశారట. మొత్తానికి ఎంతో దుఃఖంలోనూ శ్రీదేవి ఆఖరి కోరికను నెరవేర్చారట ఆమె కుటుంబ సభ్యులు. కాగా శ్రీదేవి నేడు మనతో లేకపోయినా తన సినిమాల రూపంలో అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

తెల్లటి పూల మధ్యన శ్రీదేవి పార్థీవ దేహం..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.