RGV: ఆర్జీవీకి 1.8 మిలియన్ ఫాలోవర్స్.. ఆయన ఫాలో అయ్యేది ఆ ఒక్క డైరెక్టర్‌నే!
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. శివ సినిమాతో టాలీవుడ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసిన ఆర్జీవీ.. తాను ఎప్పుడూ ట్రెండ్ ఫాలో అవ్వనని సెట్ చేస్తాననే విధంగానే సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో కూడా అదే తీరుతో పోస్టులు పెడతాడు. ఎక్స్(ట్విటర్)లో వరుస ట్వీట్లతో లక్షల మందిని షేక్ చేసే ఆర్జీవీ, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం సైలెంట్ కిల్లర్.

రామ్ గోపాల్ వర్మ.. ఆ పేరు చెప్పగానే మైండ్‌లో ఫ్లాష్ అయ్యేది థ్రిల్లర్, కాంట్రోవర్సీ, బోల్డ్ ట్వీట్స్! ఎక్స్(ట్విటర్)లో వరుస ట్వీట్లతో లక్షల మందిని షేక్ చేసే ఆర్జీవీ, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం సైలెంట్ కిల్లర్. ఆర్జీవీ ఇన్స్టాలో @rgvzoomin అకౌంట్లో అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. ట్విటర్తో పోలిస్తే ఇన్స్టాలో ఆర్జీవీ అంతగా యాక్టివ్గా ఉండరు. అయినప్పటికీ ఆయనకి ఇన్స్టాలో 1.8 మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఆర్జీవీ ఫాలో అయ్యేది మాత్రం కేవలం 24 అకౌంట్లు! ఇందులో స్టార్ హీరోలు, హీరోయిన్లు, స్టూడియోస్ ఉన్నాయి… కానీ లీడింగ్ డైరెక్టర్లలో ఒక్కరిని మాత్రమే ఆర్జీవీ ఫాలో అవుతున్నారో… ఆ డైరెక్టర్ ఎవరో గెస్ చేయండి?
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌జీవీ ఫాలో అయ్యేది వరుస హిట్లతో ఫామ్లో ఉన్న రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్.. వీరిలో ఎవర్నో ఒకరిని అనుకుంటారు. కానీ ఎవరూ కాదు! ఆయన ఫాలోయింగ్ లిస్ట్‌లో అన్నపూర్ణ స్టూడియోస్, పూరీ కనెక్ట్స్, మరికొన్ని ఆర్ట్ పేజీలు ఉన్నాయి… కానీ డైరెక్టర్లలో ఒక్కడే స్పెషల్ స్పాట్ దక్కించుకున్నాడు. అది ఎవరో కాదు మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్! పూరీ ఇన్స్టా అకౌంట్లైన @puri_lifestyle & @puriconnects రెండింటినీ ఆర్‌జీవీ ఫాలో అవుతున్నారు. ఇది ఆర్‌జీవీ సెలెక్టివ్ నేచర్‌ను చూపిస్తుంది. పూరీ, ఆర్‌జీవీ మధ్య ఎప్పుడూ మ్యూచువల్ అడ్మిరేషన్ ఉంది. పూరీ ఆర్‌జీవీని ‘గాడ్ ఆఫ్ సినిమా’ అని పిలుస్తారు, ఆర్‌జీవీ కూడా పూరీ మాస్ టచ్‌ను ఎప్పుడూ మెచ్చుకుంటారు.

Rgv Follows Director Puri Jagannath In Instagram
‘పోకిరి’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ పూరీ. ‘శివ’తో గ్యాంగ్‌స్టర్ జోనర్‌ను రీబూట్ చేసిన లెజెండ్ ఆర్జీవీ. ఇద్దరూ రిస్క్ టేకర్స్, ఇన్నోవేటర్స్, మాస్ పల్స్ రీడర్స్. టాలీవుడ్తోపాటు బాలీవుడ్లోనూ ఆర్జీవీకి ఫాలోయింగ్ ఎక్కువే. కానీ టాప్ డైరెక్టర్లను వదిలేసి ఆర్జీవి పూరీని ఫాలో అవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే.. అదే ఆర్‌జీవీ స్టైల్!
వరుస ఫ్లాపులతో దెబ్బతిన్న పూరీ ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి, టబు, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ చార్మీ, జేబీ నారాయణరావు ప్రొడక్షన్‌లో రూపొందుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళంలో రిలీజ్ కానుంది. మాస్ యాక్షన్ మిక్స్‌తో పూరీ మ్యాజిక్ మరోసారి రచ్చ చేస్తాడేమో చూడాలి మరి!




