Tollywood : ఏంటీ మేడమ్ మీరు.. సినిమాల్లో గ్లామర్ సెగలు.. కట్ చేస్తే.. రియల్ లైఫ్లో డాక్టరమ్మా..
ప్రస్తుతం తెలుగులో అప్పుడప్పుడు అవకాశాలు అందుకుంటూ రాణిస్తున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె రియల్ లైఫ్ లో మాత్రం డాక్టరమ్మా. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

ప్రస్తుతం సినిమా ప్రపంచంలో డాక్టర్ చదువులు చదివి నటీనటులుగా సెటిల్ అయినవారు చాలా మంది ఉన్నారు. సాయి పల్లవి, శ్రీలీల వంటి తారలు ఎంబీబీఎస్ చదివినవారే. అటు డాక్టర్ చదువు చదువుతూ సినీరంగంలో రాణిస్తున్నారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఇప్పటికే డాక్టర్ గా విధులు నిర్వహించింది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న ఆమె.. నిజ జీవితంలో డాక్టర్. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. తాజాగా ఆమె కొత్త సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటో చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం గ్లామర్ బ్యూటీగా ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆమె డాక్టర్ అని తెలిసి షాకవుతున్నారు. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? తనే హీరోయిన్ కామాక్షి భాస్కర్ల.
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు చాలా తక్కువ. వైష్ణవి చైతన్య, అనన్య నాగళ్ల, అంజలి వంటి హీరోయిన్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మరో తెలుగమ్మాయి సైతం రాణిస్తుంది. ఆమె ఆసుపత్రిలో కొన్నాళ్లుగా డాక్టర్ గా పనిచేసింది. 2018లో మిస్ తెలంగాణ విజేతగా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. ప్రియురాలు అనే సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ మా ఊరి పొలిమేర సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష, పొలిమేర 2, ఓం భీమ్ బుష్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. నటనకు ఆస్కారం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే తెలుగులో ఎక్కువగా ఢీగ్లామర్ రోల్స్ చేసింది. ఇప్పుడు అల్లరి నరేష్ హీరోగా నటించిన 12A రైల్వే కాలనీ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?




