Tollywood : తెలుగులో చక్రం తిప్పింది.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఒక్క తప్పుతో ఇండస్ట్రీకి దూరం..
ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ ఆమె. చిన్న వయసులోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కేవలం రెండు సినిమాలతోనే స్టార్ అయిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

సాధారణంగా సినీరంగంలో చాలా తక్కువ మంది హీరోయిన్లు రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోతుంటారు. తొలి చిత్రంతోనే క్రేజ్ సొంతం చేసుకున్న తారల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం.. తెలుగులో తొలి చిత్రానికే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత రెండవ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఒక చిన్న తప్పుతో ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ ఇలియానా డిక్రూజ్. ఈ గోవా బ్యూటీని దర్శకుడు వైవిఎస్ చౌదరి సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు.
ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
2006లో రామ్ పోతినేని హీరోగా పరిచయమైన దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పట్లో ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన పోకిరి సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకుంది. ఈ సినిమాతో ఇలియానా పేరు ఒక్కసారిగా మారుమోగింది. ఆ తర్వాత ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్.. ఇలా అందరు స్టార్ హీరోలతో నటించే అవకాశాలు సొంతం చేసుకుంది.
తక్కువ సమయంలోనే తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది ఇలియానా. తెలుగులో మొదటిసారి కోటి పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా మారింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ కూడా వరుస డిజాస్టర్స్ రావడంతో సినిమాలకు దూరంగా ఉండిపోయింది. పెళ్లి చేసుకోకుండానే తల్లైంది. బిడ్డ పుట్టిన కొన్ని నెలలకు తన భర్తను పరిచయం చేసింది. ఇప్పుడు ఈ బ్యూటీకి ఇద్దరు అబ్బాయిలు.ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..




