AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చరణ్‌ను తెగ పొగిడేసిన వర్మ.. బుచ్చిబాబుపైనా..

చరణ్‌ను తెగ పొగిడేసిన వర్మ.. బుచ్చిబాబుపైనా..

Phani CH
|

Updated on: Nov 12, 2025 | 6:24 PM

Share

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటించిన 'పెద్ది' మూవీలోని 'చికిరి చికిరి' పాటపై రామ్‌గోపాల్‌ వర్మ ప్రశంసలు కురిపించారు. చరణ్ నటన, ఎనర్జీ అత్యుత్తమమని కొనియాడారు. దర్శకుడు బుచ్చిబాబు సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చి చరణ్‌ను అద్భుతంగా చూపించారని కీర్తించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, 'పెద్ది' సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి.

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పుడూ ఏదొక విషయంలో తరచూ వార్తలకెక్కుతూ ఉంటారు. విషయం ఏదైనా నిర్మొహమాటంగా తనదైనశైలిలో స్పందిస్తుంటారు ఆర్జీవీ. తాజాగా మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, డైరెక్టర్‌ బుచ్చిబాబుపై ప్రశంసలుకురిపించారు. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘పెద్ది’ మూవీ నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ పాట సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన వర్మ .. ఈ పాటలో చరణ్ నటనను, అతన్ని చూపించిన విధానాన్ని మెచ్చుకుంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వర్మ తన పోస్టులో.. సినిమాలోని ప్రతి కళారూపం, ప్రతి విభాగం అసలు ఉద్దేశ్యం హీరోను మెరుగుపరచడమే. చాలా కాలం తర్వాత రామ్ చరణ్‌ను తన అసలైన, సహజమైన, అద్భుతమైన రూపంలో చూశాను. ‘చికిరి చికిరి’ పాటలో చరణ్ ప్రదర్శించిన నటన, ఆవేశం, ఎనర్జీ నేను ఈ మధ్య కాలంలో చూసిన అత్యుత్తమ ప్రదర్శన అంటూ రామ్ గోపాల్ వర్మ కొనియాడారు. మరోవైపు దర్శకుడు బుచ్చిబాబును ఉద్దేశించి వర్మ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఒక స్టార్ తన చుట్టూ అతి తళుకుబెళుకుల మధ్య కాదు, సహజత్వంతో ఉన్నప్పుడే అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. నువ్వు ఆ విషయాన్ని అద్భుతంగా అర్థం చేసుకున్నావు. భారీ సెట్స్, వందల మంది డ్యాన్సర్లు లేకుండా, అసలు దృష్టి మొత్తం హీరోపైనే నిలిపావు అంటూ బుచ్చిబాబు దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ‘చికిరి చికిరి’ పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి చేరి రామ్ చరణ్ పాన్-ఇండియా క్రేజ్‌ను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీకు నచ్చినోళ్లనే సెలెక్ట్ చేస్తారా ?? టీమిండియా టెస్ట్ టీం ఎంపికపై విమర్శలు

పెళ్లయిన 6 నెలలకే.. వేధింపులు తట్టుకోలేక!

Nallamala: అప్పుడు కల్యాణానికి వజ్రాల తలంబ్రాలు.. కట్ చేస్తే ఇప్పుడు వజ్రాల వేట

ఒంట్లో ఉన్న దెయ్యాన్ని పోగొట్టాలని.. కోడలితో బలవంతంగా

మంగళాద్రి ముఖ మండపానికి మహర్దశ