AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంట్లో ఉన్న దెయ్యాన్ని పోగొట్టాలని.. కోడలితో బలవంతంగా

ఒంట్లో ఉన్న దెయ్యాన్ని పోగొట్టాలని.. కోడలితో బలవంతంగా

Phani CH
|

Updated on: Nov 12, 2025 | 5:38 PM

Share

కేరళలో అక్షరాస్యత ఉన్నా మూఢనమ్మకాలతో దారుణం వెలుగుచూసింది. కొట్టాయంలో కోడలికి దెయ్యం పట్టిందని నమ్మి, అత్తమామలు, మంత్రగాడు క్షుద్రపూజలు చేశారు. మద్యం, బీడీలు బలవంతంగా తాగించి, బూడిద తినిపించి చిత్రహింసలకు గురిచేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు భర్త, మామ, మంత్రగాడిని అరెస్టు చేశారు. ఇది మానవత్వం మంట గలిపే ఘటన.

అక్షరాస్యతలో ముందున్న కేరళ లో ఓ ఇంట్లోవారి మూఢనమ్మకం ఆ ఇంటి కోడలికి నరకం చూపించింది. ఇది మానవత్వం మంట గలిపే ఘటన. కొట్టాయంలోని తిరువాంచూరులో ప్రేమ వివాహం చేసుకున్న ఆమెకు దెయ్యం పట్టిందని తన అత్తమామలు ఆరోపించారు. మంత్రగాడు శివదాస్‌తో కలిసి కోడలిపై దారుణంగా ప్రవర్తించారు. ఆమె శరీరంలోంచి దెయ్యాన్ని వెళ్లగొట్టేందుకు క్షుద్రపూజల పేరుతో బలవంతంగా మద్యం, బీడీలు తాగిస్తూ, బూడిద తినిపిస్తూ ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించారు. అసలేం జరిగిందంటే..? ఓ 26 ఏళ్ల యువతి.. అఖిల్ దాస్‌ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి అత్తింటి వద్దే ఉంటోంది. ఇటీవల అఖిల్ దాస్ బంధువుల్లో ఒకరు మరణించారు. ఆ చనిపోయిన వారి ఆత్మ కోడలు శరీరంలో ప్రవేశించిందని అఖిల్ తల్లి ఆరోపించింది. దీంతో నవంబర్ 2వ తేదీన మంత్రగాడు శివదాస్‌ను ఇంటికి రప్పించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పది గంటల పాటు పూజలు చేయించారు. యువతికి ఒంట్లో దెయ్యం ఉందని.. దాన్ని వెళ్లగొట్టే నెపంతో నరకం చూపించారు. ఆమె వద్దని వేడుకుంటున్నా వినకుండా ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. బీడీ కూడా కాల్చేలా చేశారు. ఆ బూడిదను కూడా ఆమె చేత తినిపించారు. ఈ క్షుద్రపూజల సమయంలో ఆమెను తీవ్రంగా హింసించారు. శరీరంపై వాతలు పెట్టారు. కొన్ని గంటల పాటు శారీరకంగా, మానసికంగా వేధించారు. హింస కారణంగా ఆ మహిళ పూర్తిగా స్పృహతప్పి పడిపోయింది. ఆమె మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింది. విషయం తెలుసుకున్న ఆ యువతి తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు.. తీవ్ర ఒత్తిడిలో ఉన్న బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. భర్త, మామ, మంత్రగాడిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలైన అత్త పరారీలో ఉంది. తమ కుమార్తెను అంతగా హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తండ్రి కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంగళాద్రి ముఖ మండపానికి మహర్దశ

Organ Donation: మరణం తర్వాత అవయవదానం

ఫ్రైడ్ రైస్‌లో బొద్దింకషాకైన కస్టమర్లు

తాగకపోతే దాహం, తాగితే రోగం 143 కృష్ణా గ్రామాల వారి ఆవేదన

సంక్రాంతికి రైల్వే టికెట్ బుకింగ్ కు ఇదే రైట్ టైమ్‌