AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతికి రైల్వే టికెట్ బుకింగ్ కు ఇదే రైట్ టైమ్‌

సంక్రాంతికి రైల్వే టికెట్ బుకింగ్ కు ఇదే రైట్ టైమ్‌

Phani CH
|

Updated on: Nov 12, 2025 | 5:14 PM

Share

సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లే తెలుగు ప్రయాణికులకు ముఖ్య గమనిక. రైలు టికెట్ల కోసం 60 రోజుల ముందస్తు బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోండి. IRCTC వెబ్‌సైట్‌లో జనవరి 12, 14, 15 తేదీల ప్రయాణానికి సంబంధించి టికెట్లు విడుదలయ్యాయి. ఆలస్యం చేస్తే రద్దీ, అధిక బస్సు ఛార్జీలు తప్పవు. పండగ ప్రయాణం సులభతరం చేసుకోండి.

ఇంకో రెండు నెలల్లో తెలుగు లోగిళ్లల్లో సంక్రాంతి పండగ సందడి ఉండనుంది. ఇంటి ముందు రంగవల్లులు, కోడిపందేలు, గంగిరెద్దుల ఆటలతో వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణల్లో పండగ కోలాహలం ఏర్పడనుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో నివసించే తెలుగువాళ్లందరూ సొంతూర్లకు ప్రయాణం కట్టడం ఆనవాయితీగా వస్తోంది. సంక్రాంతికి ఇంటికి వెళ్లాలనుకునే వారు ఇక రైలు టికెట్ల బుకింగ్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది. 60 రోజుల ముందే రైలు టికెట్లను బుక్ చేసుకునే వెసలుబాటు అందుబాటులో ఉంది. దీని వల్ల పండగ తేదీలకు సరిగ్గా 60 రోజుల ముందు IRCTC వెబ్సైట్ లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేక రైళ్ల కోసం ఎదురుచూడకుండా ఈ 60 రోజుల గడువును ఉపయోగించుకుని అడ్వాన్స్డ్ టికెట్ బుకింగ్ చేసుకోవడం వల్ల ఏపీకి వెళ్లే రైళ్లల్లో బెర్తులను సులభంగా పొందవచ్చు. టికెట్ల బుకింగ్‌లో ఆలస్యం చేస్తే ప్రయాణికులు దానికి తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పకపోవచ్చు. బెర్త్ లభించకపోతే రైలు ప్రయాణం ఎంత భయానకంగా ఉంటుందో.. దసరా, దీపావళి రోజుల్లో చూశాం. కాలు పెట్టడానికి కూడా వీలు లేనంతగా జనరల్ బోగీలు కిక్కిరిసిపోతుంటాయి. అలాగనీ ప్రైవేట్ బస్సుల మీద డిపెండ్ కాలేం. వేలకు వేల రూపాయలను ఛార్జీల రూపంలో వసూలు చేసిన సందర్భాలు ఎన్నో. కనీస టికెట్ 3,000 నుంచి 5,000 రూపాయల వరకు ఉండొచ్చు. అందుకే ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవడం మంచిది. సంక్రాంతి పండగకు రైలు టికెట్ల బుకింగ్ ఈ నెల 13 నుంచి ప్రారంభమౌతుంది. జనవరి 12వ తేదీన ప్రయాణానికి సంబంధించి.. 60 రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకునే నిబంధన ప్రకారం ఈ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. జనవరి 12వ తేదీ ప్రయాణానికి సంబంధించి.. 60 రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకునే నిబంధన ప్రకారం ఈ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. జనవరి 14వ తేదీ ప్రయాణానికి ఈ నెల 15వ తేదీన బుకింగ్ మొదలవుతుంది. జనవరి 15వ తేదీ ప్రయాణానికి ఈ నెల 16వ తేదీన బుకింగ్ మొదలవుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సెంట్రల్‌ జైల్లో ఖైదీల రాజభోగాలు..!

RGV: చిరంజీవికి రామ్‌గోపాల్‌ వర్మ సారీ..!

పని ఒత్తిడి 10 మంది ప్రాణాలు తీసిన నర్స్

జబ్బులే రాని, మరణమే లేని బిడ్డ కావాలా? సాధ్యమా ??

ప్రాణం తీసిన వాటర్ హీటర్.. వేడినీళ్లు పెట్టుకుంటుండగా..