AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పని ఒత్తిడి 10 మంది ప్రాణాలు తీసిన నర్స్

పని ఒత్తిడి 10 మంది ప్రాణాలు తీసిన నర్స్

Phani CH
|

Updated on: Nov 12, 2025 | 4:38 PM

Share

పశ్చిమ జర్మనీలో ఒక మేల్‌ నర్స్‌ పని ఒత్తిడి తట్టుకోలేక 10 మంది రోగులను హత్య చేసి, మరో 27 మందిని చంపేందుకు ప్రయత్నించాడు. రాత్రి షిఫ్టులో రోగులకు మార్ఫిన్ ఇచ్చి తన పనిభారం తగ్గించుకోవడానికి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతని నేరాలు రుజువు కావడంతో కోర్టు జీవిత ఖైదు విధించింది. విపరీతమైన పని ఒత్తిడితో మానసిక ఆందోళనకు గురైన ఓ మేల్‌ నర్స్‌.

విపరీతమైన పని ఒత్తిడితో మానసిక ఆందోళనకు గురైన ఓ మేల్‌ నర్స్‌. 10 మంది రోగులను హత్య చేయడమే కాకుండా మరో 27 మందిని చంపేందుకు ప్రయత్నించాడు. అతని ఘాతుకాలు రుజువు కావడంతో నర్స్‌కు పశ్చిమ జర్మనీలోని కోర్టు జీవిత ఖైదు విధించింది. పేరు వెల్లడి కాని ఆ నర్స్‌ వుర్సెలెన్‌ హాస్పిటల్‌లో నిత్యం రాత్రి షిఫ్ట్‌లో పనిచేసేవాడు. కాన్సర్‌ ఇతర ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ చికిత్స కోసం వచ్చే రోగులకు పాలియేటివ్‌ కేర్‌ అందించే హాస్పిటల్‌లో ఆ నర్స్‌ పని చేసేవాడు. పని ఒత్తిడిని తగ్గించేందుకు అతను తన పర్యవేక్షణలో ఉన్న వృద్ధ రోగులకు మార్ఫిన్ మత్తుమందును ఇంజెక్ట్ చేసి చంపేసాడు. ఈ హత్యలు 2023 – 24 మధ్య పశ్చిమ జర్మనీలోని వుర్సెలెన్ పట్టణంలో జరిగాయి. రోగులు వరుసగా రాత్రి పూటే మృతి చెందడంతో అనుమానం కలిగిన వైద్యులు ఆరా తీయగా నర్స్‌ పాత్ర బయటపడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్స్‌.. నిత్యం సంరక్షణ అవసరమయ్యే రోగుల విషయంలో సానుభూతి చూపలేదని, అతను సాగించిన నేరాలు.. ఇప్పటివరకూ గుర్తించిన వాటికన్నా ఎక్కువే ఉండవచ్చని ప్రాసిక్యూటర్లు వాదించారు. మరిన్ని మృతదేహాలను వెలికితీసి, పరీక్షలకు పంపిస్తామని జడ్జితో అన్నారు. అలాగే దోషిని తిరిగి విచారించే అవకాశం కూడా ఉంది. మేల్‌ నర్స్‌ 2007లో నర్సింగ్ శిక్షణ పూర్తి చేసుకుని 2020లో ఆస్పత్రిలో చేరాడు. రాత్రి షిఫ్ట్‌లో ఉన్నప్పుడు అతను రోగుల మరణాలను వేగవంతం చేయడానికి, తన పనిభారాన్ని తగ్గించడానికి బాధితులకు అధిక మోతాదులో మార్ఫిన్, మిడాజోలం మత్తు ఇంజెక్షన్లు ఇచ్చాడనే ఆరోపణలున్నాయి. అయితే అతని చర్యలు అత్యంత తీవ్రమైనవని కోర్టు అతనికి శిక్ష విధించే సమయంలో తెలిపింది. అతను 15 ఏళ్ల కన్నా ముందుగా విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే దోషికి ఇప్పటికీ పైకోర్టుకు అప్పీల్ చేసుకునే హక్కు ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జబ్బులే రాని, మరణమే లేని బిడ్డ కావాలా? సాధ్యమా ??

ప్రాణం తీసిన వాటర్ హీటర్.. వేడినీళ్లు పెట్టుకుంటుండగా..

కళ్లు చెదిరేంత బంగారం దొరికినా కన్నెత్తి చూడలేదు..

తిరుమలలో అంబానీ కిచెన్‌.. నిత్యం 2 లక్షల మందికి సరిపడేలా వంటశాల

ఫుట్‌పాత్‌పై పాలమ్మే వ్యక్తి కూతురు.. వరల్డ్‌ ఛాంపియన్‌