ఐదు కొడితే పెన్ డౌన్ చేస్తా.. కోటీశ్వరుడి వర్క్ లైఫ్ బ్యాలెన్స్
మంగళవారం ఐదు గంటల కల్లా తన పనికి ఫుల్‌స్టాప్ పెట్టడం తనకలవాటు అంటూ నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ రాండోల్ఫ్ తన వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ మంత్రాన్ని తెలియచేసారు. 30 ఏళ్లుగా ఇదే పద్ధతిని పాటిస్తున్నానని అన్నారు. ఆ రోజు ఎండైనా వానైనా సరే ప్లాన్‌లో ఎలాంటి మార్పూ ఉండదనీ ఆ రోజు తన స్నేహితుడితో కలిసి సినిమాకో, డిన్నర్‌కో వెళతాననీ ఏమీ లేకపోతే విండో షాపింగ్ చేస్తా అని పోస్ట్‌లో రాసుకొచ్చారు.
మంగళవారం ఐదు గంటల కల్లా తన పనికి ఫుల్‌స్టాప్ పెట్టడం తనకలవాటు అంటూ నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ రాండోల్ఫ్ తన వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ మంత్రాన్ని తెలియచేసారు. 30 ఏళ్లుగా ఇదే పద్ధతిని పాటిస్తున్నానని అన్నారు. ఆ రోజు ఎండైనా వానైనా సరే ప్లాన్‌లో ఎలాంటి మార్పూ ఉండదనీ ఆ రోజు తన స్నేహితుడితో కలిసి సినిమాకో, డిన్నర్‌కో వెళతాననీ ఏమీ లేకపోతే విండో షాపింగ్ చేస్తా అని పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఆ రోజు ఎలాంటి కాన్ఫరెన్స్ కాల్సూ పెట్టుకోననీ ఎంత పెద్ద చిక్కొచ్చినా 5 గంటలకల్లా తన పనిని ముగిస్తా అన్నారు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం తను ‘సరిపోదా మంగళవారం’ రూల్‌ను పాటిస్తా అని చెప్పుకొచ్చారు. రాండోల్ఫ్ పోస్ట్ పాతదే అయినా ప్రస్తుతం మరోసారి వైరల్ అవుతోంది. తన జీవితమంతా ఎంతో కష్టపడి పనిచేశానని, వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ కోసం మాత్రం ఆ ఒక్కరోజు తనకు నచ్చినట్లు గడుపుతానంటూ రాసుకొచ్చారు. ఉద్యోగ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య బాలెన్స్ ఉండాలనేది ఉద్యోగుల వాదన అయితే వారం చివర పనిచేస్తేనే ‘ఫ్యూచర్’ ఉంటుందని బాస్‌లు వాదిస్తారు. టైమ్ చూసుకుంటూ పనిచేస్తే అనుకున్న లక్ష్యాలు సాధించలేమనీ పైకెదగలేమనీ అంటారు. ఈ అంశంపై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పిలుపునిచ్చి ఆ వెంటనే యూటర్న్ తీసుకున్నారు. తమ సంస్థలో ఉద్యోగులెవరూ ఓవర్ టైం చేయొద్దని సూచించారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడంతో పాటు వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్యోగులకు మెయిల్ చేసారు. వారానికి 5 రోజులు చొప్పున రోజుకు సగటున 9.15 గంటలు మాత్రమే పని చేయాలని స్పష్టం చేసారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చరణ్‌ను తెగ పొగిడేసిన వర్మ.. బుచ్చిబాబుపైనా..
మీకు నచ్చినోళ్లనే సెలెక్ట్ చేస్తారా ?? టీమిండియా టెస్ట్ టీం ఎంపికపై విమర్శలు
పెళ్లయిన 6 నెలలకే.. వేధింపులు తట్టుకోలేక!
Nallamala: అప్పుడు కల్యాణానికి వజ్రాల తలంబ్రాలు.. కట్ చేస్తే ఇప్పుడు వజ్రాల వేట
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

