సెంట్రల్ జైల్లో ఖైదీల రాజభోగాలు..!
బెంగళూరు సెంట్రల్ జైలులో భద్రతా లోపాలు బయటపడ్డాయి. తాజాగా బయటపడిన రెండు వీడియోలు పరప్పణ అగ్రహార ఖైదీల విలాసాలను వెలుగులోకి తెచ్చాయి. ఖైదీలు డ్యాన్సులు చేస్తూ, మద్యం సేవిస్తూ పార్టీలు చేసుకుంటున్నారు. జుహైబ్, ఉమేష్ రెడ్డి, తరుణ్ వంటి హై-ప్రొఫైల్ ఖైదీలు కూడా రాజభోగాలు అనుభవిస్తున్నారని ఆరోపణలున్నాయి. కర్ణాటక సీఎం చర్యలకు హామీ ఇచ్చారు.
బెంగళూరు సెంట్రల్ జైల్లో భద్రతా లోపాలు బయటపడుతున్నాయి. తాజాగా బయటపడిన రెండు వీడియోలు ఖైదీల విలాసాలను వెలుగులోకి తెచ్చాయి. పరప్పణ అగ్రహార జైల్లో ఖైదీలు డ్యాన్సులు చేస్తూ, మద్యం సేవిస్తూ పార్టీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొందరు ఖైదీలు పాత్రలను వాయిస్తూ ఉంటే, అందుకు అనుగుణంగా మరికొందరు డ్యాన్సులు చేస్తున్నట్లు కనిపించింది. జైల్లోకి మద్యం సరఫరా అవుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. వీటికి బలం చేకూరుస్తూ మద్యం సీసాలు, ఖైదీల డ్యాన్సులు వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పటికే ముగ్గురు ఖైదీలు జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. మొబైల్ ఫోన్లు వాడుతున్న ఐసిస్ రిక్రూటర్ జుహైబ్ హమీద్ షకీల్ మున్నా, దర్జాగా ఫోన్‌లో మాట్లాడుతున్న సీరియల్ రేపిస్ట్ ఉమేష్ రెడ్డి, టీవీ చూస్తూ గడుపుతున్న గోల్డ్ స్మగ్లర్ తరుణ్ సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ విషయమై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జైలు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి జీ పరమేశ్వర హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RGV: చిరంజీవికి రామ్‌గోపాల్ వర్మ సారీ..!
పని ఒత్తిడి 10 మంది ప్రాణాలు తీసిన నర్స్
జబ్బులే రాని, మరణమే లేని బిడ్డ కావాలా? సాధ్యమా ??
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

