Ramoji Rao Death: రామోజీరావు ఆ సినిమాలో నటించారని మీకు తెలుసా.?
సామాన్య వ్యక్తి నుంచి ఓ వ్యవస్థగా ఎదిగారు రామోజీరావు. 1936 నవంబర్ 16న కృష్ణాజిల్లా పెదపారుపూడిలో జన్మించారు రామోజీరావు. ఆయన అసలు పేరు చెరుకూరి రామయ్య. ఈటీవీ అధినేతగా.. పత్రికా సంపాదకులుగా.. ప్రచురణకర్తగా.. సినీ నిర్మాత, వ్యాపారవేత్తగా పేరుప్రఖ్యాతులు సంపాదించారు రామోజీరావు. గుడివాడలోనే పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ చదివారు రామోజీరావు. 2016లో రామోజీరావుకు భారత రెండో అత్యున్నత పద్మవిభూషణ్ పురస్కారం లభించింది.
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేటి ఉదయం కన్నుమూశారు. రామోజీరావు మరణంతో తెలుగు రాష్ట్రాలు దిగ్బ్రతికి గురయ్యాయి. సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు రామోజీరావు మరణానానికి సంతాపం తెలుపుతున్నారు. సామాన్య వ్యక్తి నుంచి ఓ వ్యవస్థగా ఎదిగారు రామోజీరావు. 1936 నవంబర్ 16న కృష్ణాజిల్లా పెదపారుపూడిలో జన్మించారు రామోజీరావు. ఆయన అసలు పేరు చెరుకూరి రామయ్య. ఈటీవీ అధినేతగా.. పత్రికా సంపాదకులుగా.. ప్రచురణకర్తగా.. సినీ నిర్మాత, వ్యాపారవేత్తగా పేరుప్రఖ్యాతులు సంపాదించారు రామోజీరావు. గుడివాడలోనే పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ చదివారు రామోజీరావు. 2016లో రామోజీరావుకు భారత రెండో అత్యున్నత పద్మవిభూషణ్ పురస్కారం లభించింది.
పెనమలూరుకు చెందిన తాతినేని రమాదేవితో 1961 ఆగస్టు 19న వివాహం జరిగింది. 1962 హైదరాబాద్‌కు తిరిగివచ్చి అదే ఏడాది అక్టోబర్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1965లో కిరణ్ యాడ్స్‌ను ప్రారంభించారు. 1967 – 1969 వరకు ఖమ్మం పట్టణంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం ప్రారంభించారు. 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. రామోజీరావు 1974లో ఈనాడు పత్రికను ప్రారంభించారు. 1976 అక్టోబర్ 3న సితార అనే సినీ పత్రిక ప్రారంభించారు. 1978లో చతుర, వివిధ భాషా కథల సమాహారంగా విపుల మాసపత్రికను మొదలుపెట్టారు. ప్రియా ఫుడ్స్‌ను 1980 ఫిబ్రవరి 9న ప్రారంభించారు.
ఇక ఉషా కిరణ్ మూవీస్ పేరుతో సినిమాలను నిర్మించారు రామోజీరావు. అయితే ఆయన ఓ సినిమాలో కనిపించారన్న విషయం మీకు తెలుసా.? . స్వతహాగా కళాభిమాని అయిన రామోజీరావు చిన్నతనంలో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అలాగే ఒక సినిమాలోనూ అతిథిగా నటించారు. యు. విశ్వేశ్వరరావు 1978లో నిర్మించిన ‘మార్పు’ సినిమాలో ఆయన న్యాయమూర్తి పాత్ర పోషించారు. అతిథి పాత్రలో నటించినప్పటికీ, సినిమా పోస్టర్లపై రామోజీరావు ఫోటోను ప్రచురించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.