Chiranjeevi: మెగాస్టార్ నిద్ర లేవగానే మొదట ఎవరి ముఖం చూస్తారో తెలుసా? అసలు ఊహించి ఉండరు..
చిరంజీవి ఇష్టాయిష్టాల గురించి తెలుసుకోవడానికి ఆయన అభిమానులు ఎంతో ఆసక్తి, ఉత్సాహం చూపిస్తుంటారు. తాజాగా మెగాస్టార్ లైఫ్ స్టైల్ కి సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా చాలా మంది ఉదయం లేవగానే దేవుడి ఫొటోను చూస్తారు. మరికొంత మంది తల్లిదండ్రుల ఫొటోలను చూసి పనుల్లోకి వెళతారు. అయితే చిరంజీవి మాత్రం నిద్ర లేవగానే తనకు ఎంతో ఇష్టమైన
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో స్వయం కృషితో ఎదిగిన అతి కొద్ది మంది నటుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. డ్యాన్సింగ్, యాక్టింగ్ లలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఆయన ఇప్పటివరకు 150 కు పైగా సినిమాలు చేశారు. కెరీర్ ప్రారంభంలో ఎలాంటి ఈజ్ తో సినిమాలు చేస్తున్నారో ఇప్పుడు కూడా అదే ఈజ్, ఇంట్రెస్ట్ తో మూవీస్ చేస్తున్నారయన. అందుకే ఇండస్ట్రీలోని యువ హీరోలందరూ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుంటారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ ను ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఈ సంగతి పక్కన పెడితే.. చిరంజీవి ఇష్టాయిష్టాల గురించి తెలుసుకోవడానికి ఆయన అభిమానులు ఎంతో ఆసక్తి, ఉత్సాహం చూపిస్తుంటారు. తాజాగా మెగాస్టార్ లైఫ్ స్టైల్ కి సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా చాలా మంది ఉదయం లేవగానే దేవుడి ఫొటోను చూస్తారు. మరికొంత మంది తల్లిదండ్రుల ఫొటోలను చూసి పనుల్లోకి వెళతారు. అయితే చిరంజీవి మాత్రం నిద్ర లేవగానే తనకు ఎంతో ఇష్టమైన మహానటి సావిత్రి గారి ఫొటోను చూస్తారాట. ఈ విషయాన్ని సావిత్రి కూతురు చాముండేశ్వరి తెలిపారు. సావిత్రి పై ఆమె రాసిన ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తకాన్ని చిరంజీవి- సురేఖ దంపతులు మంగళ వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చాముండేశ్వరి చిరంజీవి ఉదయం లేవగానే సావిత్రి ఫొటోను చూసి కానీ ఇతర పనులు ప్రారంభించరన్న విషయాన్ని వెల్లడించారు.
సావిత్రి ఆశీర్వాదంతోనే..
ఇదే సందర్భంగా మహానటితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మెగాస్టార్. ‘ సావిత్రితో కలిసి ‘పునాది రాళ్లు’ సినిమాలో నటించడం నా అదృష్టం. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా రాజమహేంద్రవరంలో మొదటి సారిగా ఆమెను కలిశాను. సావిత్రిని చూడగానే నాకు నోటి వెంట మాట రాలేదు. నేను ఆమె ముందు డ్యాన్స్ చేయడం..తాను హీరోగా పైకి వస్తానని ఆశీర్వదించడం ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. నా డ్యాన్స్ మూమెంట్స్ చూసి మంచి యాక్టర్ అవుతావు అని ఆశీర్వాదించారామె’ అని మహానటితో తనకున్న మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు చిరంజీవి.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు చిరంజీవి. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిరంజీవి దంపతులతో సావిత్రి కూతురు విజయ ఛాముండేశ్వరి..
Savitri gari Daughter Vijaya Chamundeswari garu about #Chiranjeevi garu,He Admires Savitri garu a lot , fews days back @KChiruTweets had a leg surgery ,He unable to walk,when I went to his home ,His recieving was very respectful and Affection ,that is #MegastarChiranjeevi pic.twitter.com/25FGZJgjl5
— Chiranjeevi Army (@chiranjeeviarmy) April 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.