AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aparna Das: పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడితో ప్రేమాయణం..

2018లో నాజన్ ప్రకాశన్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం ఇండస్ట్రీలలో పలు చిత్రాల్లో నటించి అలరించింది. అందం, అభినయంతో ప్రశంసలు అందుకున్న అపర్ణాకు అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. విజయ్ దళపతి, పూజా హెగ్డే కలిసి నటించిన బీస్ట్ మూవీతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన అపర్ణా.. గతేడాది దాదా సినిమాతో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకుంది.

Aparna Das: పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. 'మంజుమ్మెల్ బాయ్స్' నటుడితో ప్రేమాయణం..
Aparna Das, Deepak Parambol
Rajitha Chanti
|

Updated on: Apr 03, 2024 | 4:56 PM

Share

గత ఏడాది కాలంగా ఇండస్ట్రీలో పెళ్లి భజాలు మోగుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్ హీరోహీరోయిన్స్ వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే రకుల్, పరణితి చోప్రా, కియారా అద్వానీ, కృతి కర్భందా తదితరులు బ్యాచిలర్ లైఫ్‏కు గుడ్ బై చెప్పారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ వివాహ బంధంలోకి అడుగుపెడుతుంది. తన మలయాళీ హీరోయిన్ అపర్ణదాస్. 2018లో నాజన్ ప్రకాశన్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం ఇండస్ట్రీలలో పలు చిత్రాల్లో నటించి అలరించింది. అందం, అభినయంతో ప్రశంసలు అందుకున్న అపర్ణాకు అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. విజయ్ దళపతి, పూజా హెగ్డే కలిసి నటించిన బీస్ట్ మూవీతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన అపర్ణా.. గతేడాది దాదా సినిమాతో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు తన ప్రియుడు.. మలయాళీ నటుడు దీపక్ పరంబోల్ ను పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

అపర్ణ దాస్, దీపక్ పరంబోల్ కలిసి మనోకరం మూవీలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయమే ఆ తర్వాత ప్రేమగా మారిందని సమాచారం. ఇక ఇప్పుడు వీరి వివాహనికి ఇరు కుటుంబసభ్యులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 14న వీరిద్దరి వివాహం జరగనున్నట్లు తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు నటుడు దీపక్ పరంబోల్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

దీపక్ పరంబోల్.. ఇటీవల పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన మంజుమ్మల్ బాయ్స్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇటు తెలుగులోనూ అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో సౌత్ ఇండస్ట్రీలో దీపక్ పరంబోల్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్న దీపక్, అపర్ణా జంటకు నెటిజన్స్, సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.