Megastar Chiranjeevi: సావిత్రితో కలిసి చిరంజీవి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా ?.. చిరు డాన్స్‏కు మహానటి ఫిదా..

నటిగానే కాకుండా దర్శకురాలిగానూ మెప్పించింది. ఎన్నో గొప్ప సినిమాలు.. వైవిధ్యమైన పాత్రలు.. సహజమైన నటనతో వెండితెరపై అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ సినీ రంగుల ప్రపంచంలో సాయమడిగిన వారికి కాదనకుండా సహాయం చేసిన అనుకోకుండా ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. చిన్న వయసులోనే మానసిక సంఘర్షణకు గురై అనారోగ్య సమస్యలతో పోరాటం చేశారు. 1981 డిసెంబర్ 26న 45 ఏళ్ల వయసులోనే మరణించారు. ఇప్పటికీ సావిత్రి నటనను గుర్తు చేసుకుంటారు అభిమానులు.

Megastar Chiranjeevi: సావిత్రితో కలిసి చిరంజీవి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా ?.. చిరు డాన్స్‏కు మహానటి ఫిదా..
Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 03, 2024 | 5:23 PM

తెలుగు సినీ ప్రియులు ఎప్పటికీ మర్చిపోలేని నటి సావిత్రి. ఈతరానికి ఆమె గురించి అంతగా తెలియకపోవచ్చు.. కానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో సావిత్రి సినీ ప్రస్థానం ప్రతి ఒక్కరికి తెలిసింది. అద్భుతమైన నటన.. అంతకు మించిన మంచి వ్యక్తిత్వం ప్రతి ఒక్కరి గుండెల్లో చెరగని ముద్రవేసింది. అప్పట్లోనే అగ్రకథానాయికగా తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. నటిగానే కాకుండా దర్శకురాలిగానూ మెప్పించింది. ఎన్నో గొప్ప సినిమాలు.. వైవిధ్యమైన పాత్రలు.. సహజమైన నటనతో వెండితెరపై అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ సినీ రంగుల ప్రపంచంలో సాయమడిగిన వారికి కాదనకుండా సహాయం చేసిన అనుకోకుండా ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. చిన్న వయసులోనే మానసిక సంఘర్షణకు గురై అనారోగ్య సమస్యలతో పోరాటం చేశారు. 1981 డిసెంబర్ 26న 45 ఏళ్ల వయసులోనే మరణించారు. ఇప్పటికీ సావిత్రి నటనను గుర్తు చేసుకుంటారు అభిమానులు.

ఇదిలా ఉంటే.. ఇఫ్పటికే మహానటి సినిమాతో ఈ జనరేషన్స్ కు సావిత్రి జీవితం, సినీ ప్రస్థానం గురించి తెలియజేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. అలాగే ఆమె జీవితకథగా గతంలో సావిత్రి అనే బుక్ కూడా రిలీజ్ అయ్యింది. తాజాగా సావిత్రి క్లాసిక్ అనే మరో బుక్ రిలీజ్ అయ్యింది. సంజయ్ కిషోర్ రాసిన ఈ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. నిన్న రాత్రి హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో సావిత్రి క్లాసిక్ బుక్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి జయసుధ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి, మురళి మోహన్ తదితరులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ సావిత్రితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ” చిన్నప్పటి నుంచి నేను, నాన్న సావిత్రిగారి అభిమానులం. పునాది రాళ్లు సినిమాలో సావిత్రమ్మతో కలిసి నటించే అవకాశం వచ్చింది. రాజమండ్రిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమెకు పరిచయం చేశారు. ఆ తర్వాత షూటింగ్ మధ్యలో వర్షం పడడంతో షూటింగ్ ఆగిపోయింది. అదే సమయంలో నన్ను డాన్స్ చేయమన్నారు సావిత్రి గారు. దీంతో నేను డాన్స్ చేస్తూ కింద పడిపోయాను.. అలా పడుకొని స్టెప్పులు వేయడం చూసి సావిత్రమ్మ అభినందించి మంచి నటుడివి అవుతావు అని అన్నారు. ఆవిడతో రెండు సినిమాలు చేశారు. పునాది రాళ్లు సినిమా తర్వాత ప్రేమ తరంగాలు సినిమాలో సావిత్రమ్మ కొడుకు పాత్రలో నటించాను. ఆ తర్వాత ఆవిడను కలిసే అవకాశం రాలేదు ” అని అన్నారు చిరు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.