Taapsee Pannu: హీరోయిన్ తాప్సీ పెళ్లి వీడియో లీక్.. ఎంత సింపుల్‏గా జరిగిందో చూశారా..

తమ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై తాప్సీ, ఆమె ప్రియుడు స్పంధించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. పెళ్లి వార్తలతో ఎలాంటి సంబంధం లేకుండా సోషల్ మీడియాలో వరుసగా ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంది. తాజాగా తాప్సీ మ్యారేజ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. పెళ్లి వార్తల తర్వాత తొలిసారి తాప్సీ, మథియాస్ బోయ్ వివాహం వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. 

Taapsee Pannu: హీరోయిన్ తాప్సీ పెళ్లి వీడియో లీక్.. ఎంత సింపుల్‏గా జరిగిందో చూశారా..
Taapsee Pannu
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 03, 2024 | 5:51 PM

టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను పెళ్లి చేసుకున్నట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‏ను వివాహం చేసుకుందని బాలీవుడ్ మీడియా వెల్లడించింది. కానీ వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ బయటకు రాలేదు. అలాగే తమ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై తాప్సీ, ఆమె ప్రియుడు స్పంధించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. పెళ్లి వార్తలతో ఎలాంటి సంబంధం లేకుండా సోషల్ మీడియాలో వరుసగా ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంది. తాజాగా తాప్సీ మ్యారేజ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. పెళ్లి వార్తల తర్వాత తొలిసారి తాప్సీ, మథియాస్ బోయ్ వివాహం వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.

ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న వీడియోలో తాప్సీ తన స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి వేదికపైకి ఎంట్రీ ఇస్తుంది. ఎరుపు రంగు షర్వానీ సూట్‏లో పెళ్లి మండపానికి వస్తూ డాన్స్ చేసింది. ఆ తర్వాత కాబోయే భర్త మథియాస్‏ను ఆప్యాయంగా కౌగిలించుకుంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. వీరిద్దరి వివాహం మార్చి చివరి వారంలో జరిగినట్లు తెలుస్తోంది. ఉదయపూర్‌లోని ప్రముఖ ప్యాలెస్‏లో వీరిద్దరి వివాహం ఎంతో సింపుల్ గా జరిగినట్లు సమాచారం. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే వీరి పెళ్లికి హాజరయ్యారు.

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది తాప్సీ. కొన్నాళ్లుగా ఆమె తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. 2013లో ప్రారంభమైన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో డానిష్ బ్యాడ్మింటన్ కోచ్ మథియాస్ బోతో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. కొద్ది రోజుల క్రితమే తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దాదాపుగా 10 సంవత్సరాలుగా వీరు ప్రేమలో ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే