AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. ఇప్పుడు టాలీవుడ్ లక్కీ ఛార్మ్.. ఈ హీరోయిన్ చేసిన సినిమాలన్నీ హిట్టే

ఈ అమ్మాయి ఇప్పటివరకు మొత్తం నాలుగు సినిమాలు చేసింది. అన్నీ సూపర్ హిట్లే. ఇక మొదటి రెండు సినిమాలైతే ఏకంగా వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. దీంతో ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ ఛార్మ్ గా మారిపోయింది.

Tollywood: ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. ఇప్పుడు టాలీవుడ్ లక్కీ ఛార్మ్.. ఈ హీరోయిన్ చేసిన సినిమాలన్నీ హిట్టే
Tollywood Actress
Basha Shek
|

Updated on: May 03, 2025 | 12:33 PM

Share

ప్రస్తుతం సినిమా రంగంలో ఉన్న స్టార్స్ లో చాలామంది కెరీర్ ప్రారంభంలో వివిధ రకాల పనులు, ఉద్యోగాలు చేసిన వారే. ఈ ముద్దుగుమ్మ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ బ్యూటీ చిన్నప్పటి నుంచి చదువులో టాపర్. పదో తరగతిలో 94 శాతం మార్కులు సాధించింది. ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో ఏకంగా 85 శాతం మార్కులతో డిస్టింక్షన్ సాధించింది. ఆ తర్వాత బెంగళూరులోని ఒక దిగ్గజ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా జాబ్ చేసింది. అయితే అదే సమయంలో మోడలింగ్ అవకాశమొచ్చింది. ఉద్యోగం చేస్తూనే పలు అందాల పోటీల్లో పాల్గొంది. మిస్ కర్ణాటక అండ్ మిస్ బ్యూటీఫైల్, మిస్ సుప్రానేషనల్ వంటి ప్రతిష్ఠాత్మక టైటిల్స్ ను గెల్చుకుంది. ఇవే గాక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్ , జపాన్ , సింగపూర్ , థాయిలాండ్ , స్లోవేకియా, పోలాండ్ తదితర దేశాల్లో జరిగిన అందాల పోటీల్లోనూ సత్తా చాటింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టింది.

కొద్దిగా గ్యాప్ తీసుకున్నా మొదటి రెండు సినిమాలతోనే ఏకంగా రూ.1250 కోట్లు రాబట్టింది. తద్వారా భారత దేశంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించిన మరో మూవీ బాక్సాఫీస వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇలా చేసిన సినిమాలన్నీ హిట్ కావడంతో ప్రస్తుతం ఈ హీరోయిన్ పేరు తెగ వినిపిస్తోంది. ఇక నెట్టింట ఈ బ్యూటీ పేరు తెగ మార్మోగిపోతోంది. మరి లక్కీ ఛార్మ్ గా మారిపోయిన ఈ అందాల తార ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు హిట్ -3 హీరోయిన్ శ్రీనిధి శెట్టి.

ఇవి కూడా చదవండి

హిట్-3 ప్రమోషన్లలో..

శ్రీనిధి ఇప్పటివరకు కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కోబ్రా, హిట్-3 సినిమాలు చేసింది. ఇందులో ఒక్క కోబ్రా మాత్రమే యావరేజ్ గా నిలిచింది. ఇక మిగతా సినిమాలన్నీసూపర్ హిట్స్. 2022లో కోబ్రా సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ దాదాపు మూడేళ్ల తర్వాత ‘హిట్ 3’తో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. శుక్రవారం (మే 01)న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ. 63 కోట్లు రాబట్టింది. హిట్-3 తర్వాత టిల్లు ఫేమ్ సిద్దూ జొన్నలగడ్డతో కలిసి మీకు తెలుసు కదా అనే సినిమాలో నటిస్తోంది శ్రీనిధి శెట్టి. దీంతో పాటు ఓ కన్నడ మూవీలోనూ కథానాయికగా కనిపించనుంది.

శ్రీనిధి శెట్టి గ్లామరస్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!