AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR: భీమ్ తగ్గేదేలే.. ‘వార్ 2’ మూవీ కోసం ఎన్టీఆర్ పారితోషికం ఎంతో తెలుసా.?

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కబోతున్న 'వార్ 2'లో ఎన్టీఆర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీతోనే యంగ్ టైగర్..

NTR: భీమ్ తగ్గేదేలే.. 'వార్ 2' మూవీ కోసం ఎన్టీఆర్ పారితోషికం ఎంతో తెలుసా.?
Ntr
Ravi Kiran
|

Updated on: May 11, 2023 | 1:19 PM

Share

‘ఆర్ఆర్ఆర్’ మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవల్‌లో ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘వార్ 2’ సినిమా అవకాశాన్ని దక్కించుకున్నాడు ఎన్టీఆర్. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కబోతున్న ‘వార్ 2’లో ఎన్టీఆర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీతోనే యంగ్ టైగర్.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ ఈ రోల్ కోసం తీసుకోబోయే రెమ్యూనరేషన్ గురించి ఓ కీలక అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.

‘వార్ 2’ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా రూ. 30 కోట్ల వరకు పారితోషికం తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ నెగటివ్ రోల్‌లో కనిపించనున్నారట. ‘వార్’ సిరీస్‌లో భాగంగా రాబోతున్న ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నాడు. కాగా, ఈ మూవీ 2024 చివర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటుస్తుండటంతో ఈ మల్టీస్టారర్‌పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.