Nayanthara: భర్త సినిమా నుంచి తప్పుకున్న నయనతార.. కారణం ఏంటంటే
షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది నయన్. అక్కడ తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో నయన్ ఒకరు. ఈ అమ్మడు ఏకంగా 10 కోట్లవరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది. హీరోలకు సరిసమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ నిర్మాతలు చుక్కలు చూపిస్తుంది.

లేడీ సూపర్ స్టార్ నయనతార డిమాండ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలుసు. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది నయన్. తమిళ్, తెలుగు సినిమాలతో పాటు ఇటీవలే హిందీలోకి కూడా అడుగుపెట్టింది. షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది నయన్. అక్కడ తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో నయన్ ఒకరు. ఈ అమ్మడు ఏకంగా 10 కోట్లవరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది. హీరోలకు సరిసమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ నిర్మాతలు చుక్కలు చూపిస్తుంది. స్టార్ హీరోల సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ మెప్పిస్తుంది. ఇటీవలే అన్నపూర్ణి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది .
అయితే ఈ సినిమా అనుకోకుండా వివాదంలో చిక్కుకుంది. శ్రీ రాముడిని కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ కూడా ఈ సినిమాను తొలగించింది. తాజాగా నయనతార కూడా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పింది. ఇదిలా ఉంటే ఇప్పుడు నయన్ గురించిన ఓ వార్త ఇప్పుడు కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. తాజాగా నయన్ ఓ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. అది కూడా భర్త సినిమా నుంచి..
నయన్ విగ్నేష్ శివన్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విఘ్నేశ్ ఎల్‌ఐసీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నయన్ ను ఫిక్స్ చేశారు విగ్నేష్.. అయితే అమ్మడు రెమ్యునేషన్ ఓ రేంజ్ లో అడగడంతో నిర్మాత నోరెళ్లబెట్టారట. ప్రస్తుతం సినిమాకు 10కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్న నయన్. తన భర్త సినిమాకు 12కోట్ల వరకు డిమాండ్ చేసిందట. దాంతో నిర్మాత షాక్ అయ్యి.. అంత ఇహుకోలేనని చేతులు ఎత్తేశారట. దాంతో ఈ సినిమా నుంచి నయన్ తప్పుకుందని టాక్ వినిపిస్తుంది.
View this post on Instagram
నయనతార ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
