Fact Check: హీరో సూర్య రూ.120 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కొన్నాడా..? అందులో నిజమెంత..

హీరో సూర్య సొంతం ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అత్యంత అనుకూలమైన డస్సాల్డ్ ఫాల్కర్ 2000 జెట్‌ను సూర్య కొనుగోలు చేసినట్లు రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆ జెట్ ధర రూ.120 కోట్లు అని.. అలాగే కొన్ని అత్యాధునిక సాంకేతికత, భద్రతా సౌకర్యాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Fact Check: హీరో సూర్య రూ.120 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కొన్నాడా..? అందులో నిజమెంత..
Suriya
Follow us

|

Updated on: Aug 23, 2024 | 4:17 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అలాగే డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో మరో కొత్త ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉంటే..ఇటీవల కొద్దిరోజులుగా సూర్యకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. అదెంటంటే.. హీరో సూర్య సొంతం ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అత్యంత అనుకూలమైన డస్సాల్డ్ ఫాల్కర్ 2000 జెట్‌ను సూర్య కొనుగోలు చేసినట్లు రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆ జెట్ ధర రూ.120 కోట్లు అని.. అలాగే కొన్ని అత్యాధునిక సాంకేతికత, భద్రతా సౌకర్యాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు తమిళంలో ఇలాంటి ప్రైవేట్ జెట్ ఏ నటుడు కొనుగోలు చేయలేదని.. కేవలం సూర్య మాత్రమే ఈ ప్రైవేట్ జెట్ సొంతం చేసుకున్నాడని టాక్ నడుస్తుంది. అయితే తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం సూర్య గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని.. అతడు ఎలాంటి ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయలేదని సూర్య సన్నిహితులు అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం సూర్య తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు.

సూర్య నటించిన కంగువ సినిమా అక్టోబర్ 10, 2024న థియేటర్లలోకి రానుంది. ఇక అదే రోజున రజినీకాంత్ నటించిన వేట్టైయాన్ సినిమా కూడా రిలీజ్ కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సూర్య వర్సెస్ రజినీ మధ్య పోటీ ఉండనుంది. కంగువ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని, యోగి బాబు, జగపతి బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.