Dhruva Sarja: రాముడి ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తంలోనే పిల్లలకు నామకరణం చేసిన స్టార్‌ హీరో.. ఏం పేర్లు పెట్టాడంటే?

|

Jan 22, 2024 | 4:39 PM

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం (జనవరి 22) 12.29 నిమిషాలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. దీంతో 500 ఏళ్ల రామ భక్తుల కల సాకారమైంది. రాముడు కొలువు దీరడంతో దేశమంతా భక్తి భావనలో మునిగిపోయింది

Dhruva Sarja: రాముడి ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తంలోనే పిల్లలకు నామకరణం చేసిన స్టార్‌ హీరో.. ఏం పేర్లు పెట్టాడంటే?
Dhruva Sarja family
Follow us on

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం (జనవరి 22) 12.29 నిమిషాలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. దీంతో 500 ఏళ్ల రామ భక్తుల కల సాకారమైంది. రాముడు కొలువు దీరడంతో దేశమంతా భక్తి భావనలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో బాల రాముడి కొలువు దీరిన శుభ ముహూర్తంలోనే తన పిల్లలకు నామకరణం చేశాడు కన్నడ స్టార్‌ హీరో ధ్రువ్‌ సర్జా. స్వయంగా ఆంజనేయుని భక్తుడైన అతను రామ భక్తిని ఇలా చాటుకున్నాడు. ఇక హనుమంతుడి పేరు వచ్చేలా తన కూతురుకు రుద్రాక్షి అని, కుమారుడికి హయగ్రీవ అని పేర్లు పెట్టడం విశేషం. ధృవ సర్జా, ప్రేరణ నవంబర్ 2019 లో వివాహం చేసుకున్నారు. ప్రేరణ, ధృవ సర్జాలకు ఇద్దరు పిల్లలు. 2022 అక్టోబర్‌లో ఒక కూతురు పుట్టింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2023లో ఒక అబ్బాయి పుట్టాడు. అయితే ఇప్పటివరకు ఇద్దరికీ పేర్లు పెట్టలేదు. ఇప్పుడు కూతురికి రుద్రాక్షి అని, కొడుకుకి హయగ్రీవ అని పేరు పెట్టారు.

అన్న సమాధి దగ్గరే..

 

ఇవి కూడా చదవండి

కాగా నేలగులిలో ఉన్న తన సోదరుడు చిరంజీవి సర్జా సమాధి దగ్గరే నామకరణం ఫంక్షన్‌ను నిర్వహించాడు ధ్రువ్‌ సర్జా. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ధృవ సర్జా, ప్రేరణ, నటి మేఘనా రాజ్ తదితరులు పాల్గొన్నారు. పొగరు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు ధ్రువ్‌ సర్జా. త్వరలోనే మరో పాన్‌ ఇండియా సినిమాతో మన ముందుకు వస్తున్నాడీ స్టార్‌ హీరో. అతను నటిస్తోన్న ‘మార్టిన్’ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పనులు పూర్తయ్యాయని అంటున్నారు. ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ‘కేడీ’ పనుల్లో బిజీగా ఉన్నాడు. జోగి ప్రేమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కు స్వయానా మేనల్లుడు అవుతాడు ధ్రువ్ సర్జా. ఇతని సోదరుడు చిరంజీవి సర్జా కూడా యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూశాడు.

అన్న సమాధి దగ్గరే సీమంతం..

భార్యతో ధ్రువ సర్జా..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి