AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pandu Master: ఢీ డ్యాన్సర్ పండు మాస్టర్‌కు ఘోర రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయాలు

ఢీ డ్యాన్స్ షో ద్వారా గుర్తింపు పొందిన పండు మాస్టర్ విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తగరపువలస అమ్మవారి ఉత్సవాల్లో డ్యాన్స్ కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. .. ..

Pandu Master: ఢీ డ్యాన్సర్ పండు మాస్టర్‌కు ఘోర రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయాలు
Pandu Master
Ram Naramaneni
|

Updated on: Jun 03, 2026 | 7:40 AM

Share

ప్రఖ్యాత డ్యాన్స్ షో ఢీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆయన అభిమానులు, డ్యాన్స్ రంగానికి చెందినవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం ప్రకారం, పండు మాస్టర్ తన బృందంతో కలిసి తగరపువలసలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో ప్రత్యేక డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రయాణం మధ్యలో టీమ్‌లోని ఒక సభ్యుడు అస్వస్థతకు గురికావడంతో డ్రైవర్ రోడ్డుపక్కన కారును ఆపాడు. ఆ సమయంలో పండు మాస్టర్ కారులో నుంచి దిగి రోడ్డుపై నిలబడి ఉన్నారు. ఇదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ కోళ్ల వ్యాన్ నియంత్రణ కోల్పోయి నిలిచి ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావంతో కారు తీవ్రంగా దెబ్బతినగా, కారు పక్కనే ఉన్న పండు మాస్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, సహచరులు స్పందించి ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కోళ్ల వ్యాన్ అతివేగమే ప్రమాదానికి కారణమా? లేక డ్రైవర్ నిర్లక్ష్యమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. తెలుగు బుల్లితెరపై తన ప్రత్యేక డ్యాన్స్ స్టైల్‌తో, కామెడీతో గుర్తింపు పొందిన పండు మాస్టర్‌కు ప్రమాదం జరగడం అభిమానులను కలిచివేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు.

Accident

Accident

Follow Us
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?
భారత్‌లో ఆ ఒక్క కారణంతోనే 70 శాతం పడిపోయిన బంగారం కొనుగోళ్లు..
భారత్‌లో ఆ ఒక్క కారణంతోనే 70 శాతం పడిపోయిన బంగారం కొనుగోళ్లు..
పుట్టినరోజుపై ఇరువురి వెర్షన్స్ ఎలా ఉన్నాయంటే..?
పుట్టినరోజుపై ఇరువురి వెర్షన్స్ ఎలా ఉన్నాయంటే..?
వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!
వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!
బుధుడి కటాక్షం.. వారికి వ్యాపార పెట్టుబడులతో భారీ లాభాలు ఖాయం..!
బుధుడి కటాక్షం.. వారికి వ్యాపార పెట్టుబడులతో భారీ లాభాలు ఖాయం..!