Dhanush Raayan OTT: ఓటీటీలోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎక్కడ.? ఎప్పుడంటే..

|

Jul 30, 2024 | 12:11 PM

హిట్స్ఎం ప్లాప్స్ అనేవి చూడకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నారు ధనుష్. స్టార్ హీరోలందరూ ఒకదారిలో వెళ్తుంటే ధనుష్ మాత్రం చాలా డిఫరెంట్ గా సినిమాలు చేసి అలరిస్తున్నారు. తమిళ్ లోనే కాదు తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమాలుచేస్తున్నారు. మొన్నామధ్య ఓ హాలీవుడ్ సినిమాలోనూ కనిపించాడు ఈ క్రేజీ హీరో.

Dhanush Raayan OTT: ఓటీటీలోకి ధనుష్ రాయన్.. స్ట్రీమింగ్ ఎక్కడ.? ఎప్పుడంటే..
Raayan
Follow us on

తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు హీరో ధనుష్. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. హిట్స్ఎం ప్లాప్స్ అనేవి చూడకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నారు ధనుష్. స్టార్ హీరోలందరూ ఒకదారిలో వెళ్తుంటే ధనుష్ మాత్రం చాలా డిఫరెంట్ గా సినిమాలు చేసి అలరిస్తున్నారు. తమిళ్ లోనే కాదు తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమాలుచేస్తున్నారు. మొన్నామధ్య ఓ హాలీవుడ్ సినిమాలోనూ కనిపించాడు ఈ క్రేజీ హీరో. ఇక ధనుష్ నటన గురించి చెప్పాలంటే చాలా సినిమాలే ఉన్నాయి. తాజాగా ఆ లిస్ట్‌లోకి రాయన్ సినిమా కూడా చేరిపోయింది. ధనుష్ కూడా ఈ సినిమాతో ఆఫ్ సెంచురీకి చేరిపోయాడు.

ఇది కూడా చదవండి : Vishnu Priya : నేను తుప్పుపట్టిన పీస్.. ఆమె గొప్ప పీస్.. విష్ణుప్రియ ఇలా అనేసిందేంటీ..!

ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే ఈ మూవీకి ధనుష్ స్వీయ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ధనుష్ తో పాటు సందీప్ కిషన్, ఎస్ జే సూర్య, సెల్వరాఘవన్ కూడా నటించారు. అలాగే ఈ సినిమాకు లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతమే అందించారు.కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా చక్కగా చూపించారు.

ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈవిడ చంద్రముఖిలో వడివేలు భార్య..!! చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

అన్నదమ్ముల మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది ఈ సినిమా జులై 26న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. మొదటి రోజు 1.36 కోట్లు వసూల్ చేసి మంచి ఓపినింగ్స్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రాయన్ ఓటీటీ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాయన్  సినిమాను ఓటీటీలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. రాయన్  డిజిటల్ రైట్స్ కోసం చాలా సంస్థలు పోటీపడ్డాయని తెలుస్తోంది. ఫైనల్ గా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను సన్ నెక్ట్స్ సంస్థ సొంతం చేసుకుందట. ఆ విషయం సినిమా టైటిల్స్ లోనే చెప్పేశారు. ఇక ఇప్పుడు ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వదలాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ నాలుగు వారాల్లో రాయన్ భారీగా వసూల్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరి థియేటర్స్ లో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి