Dhamaka: మాస్‌ మహారాజ మాస్‌ స్టెప్పులు.. శ్రీలీలా క్యూట్‌ చిందులు.. దండకడియాల్‌ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది చూశారా?

ఈ చిత్రంలోని సాంగ్స్ అన్ని యూట్యూబ్ ను షేక్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్ దండకడియాల్ సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.

Dhamaka: మాస్‌ మహారాజ మాస్‌ స్టెప్పులు.. శ్రీలీలా క్యూట్‌ చిందులు.. దండకడియాల్‌ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది చూశారా?
Dhamaka
Follow us

|

Updated on: Feb 11, 2023 | 9:27 PM

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌ టైనర్ ”ధమాకా’. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ గ్రాండ్ గా నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధమాకా’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి మాసీవ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఈ చిత్రంలోని సాంగ్స్ అన్ని యూట్యూబ్ ను షేక్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్ దండకడియాల్ సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.

రవితేజ.. శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు. ఆయన అందించిన మ్యూజిక్ మాస్ ఆడియన్స్ ను ఓ ఊపు ఊపేశాయి. వాటిలో దండకడియాల్.. దస్తి రుమాల్ ఒకటి. ఈ పాటకు భీమ్స్ సాహిత్యాన్ని అందించడం.. సాహితి చాగంటి.. మంగ్లీతో కలిసి ఆలపించిన ఈ పాట మాస్ ఆడియన్స్‏ను ఆకట్టుంది. ఇక తాజాగా విడుదలైన ఈ సాంగ్ ఫుల్ వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

థియేటర్లో ఈ పాటకి ఒక రేంజ్ లో విజిల్స్ పడ్డాయి. సాహిత్యం పరంగా .. బీట్ పరంగా .. కొరియోగ్రఫీ పరంగా ఈ పాటకి ఫుల్ మార్కులు పడిపోయాయి. ఇక ఇప్పుడు విడుదలైన ఈ సాంగ్ ఫుల్ వీడియో మాస్ అభిమానులకు హుషారెత్తించే విషయమే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.