Dasara: క్రేజీ ఆఫర్ కొట్టేసిన దసరా డైరెక్టర్.. ఆ యంగ్ హీరోతో నెక్స్ట్ శ్రీకాంత్ సినిమా.?
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ ను కూడా రాబడుతుంది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వం వహించారు.

రీసెంట్ డేస్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో దసరా ఒకటి. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దసరా. ఈ సినిమాలో నాని ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి అలరించారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తిసురేష్ హీరోయిన్ గా అదరగొట్టింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ ను కూడా రాబడుతుంది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. శ్రీకాంత్ దర్శకత్వం పై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ దర్శకుడు అక్కినేని యంగ్ హీరోతో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది.
శ్రీకాంత్ నెక్ట్స్ సినిమా అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో చేయనున్నాడని తెలుస్తోంది. అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అఖిల్ స్పై గా కనిపించనున్నాడు.
ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో అఖిల్ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాంత్ అఖిల్ కు కథ వినిపించాడట. పవర్ ఫుల్ స్టోరీ కావడంతో అఖిల్ కూడా ఓకే చెప్పాడట. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.




