AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Darshan Case: అభిమాని హత్య కేసులో హీరో దర్శన్‌కు బెయిల్ మంజూరు.. ఏ1 పవిత్ర గౌడకు కూడా..

అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో అతనికి కర్ణాటక రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దర్శన్ తో పాటు ఈ కేసులో ఏ1 గా ఉన్న పవిత్ర గౌడతో పాటు మరికొందరు నిందితులకు కూడా బెయిల్ లభించింది.

Darshan Case: అభిమాని హత్య కేసులో హీరో దర్శన్‌కు బెయిల్ మంజూరు.. ఏ1 పవిత్ర గౌడకు కూడా..
Darshan, Pavithra
Basha Shek
|

Updated on: Dec 13, 2024 | 5:18 PM

Share

రేణుకా స్వామి హత్య కేసులో ఏడుగురు నిందితులకు కర్ణాటక రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులు ఏ1 పవిత్ర గౌడ, ఏ2 దర్శన్‌లకు కూడా బెయిల్ లభించింది. దర్శన్ ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నాడు. అయితే పవిత్రగౌడ్ గత ఆరు నెలలుగా పరప్ప అగ్రహార జైలులో గడుపుతున్నారు. శుక్రవారం (డిసెంబర్ 13) జరిగిన బెయిల్ పిటిషన్ విచారణలో నిందితురాలు పవిత్ర గౌడ తరఫున సీనియర్ న్యాయవాది సెబాస్టియన్ వాదించారు. పవిత్ర గౌడ సింగిల్ పేరెంట్ అని, ఆమె మహిళ అని, ఈ కేసులో ఆమెకు ఎలాంటి పాత్ర లేదని చెప్పారు. ఆమె రేణుకా స్వామి అపహరణకు గానీ, హత్యకు గానీ సహకరించలేదని న్యాయమూర్తికి తెలియజేశారు. ‘పవిత్ర సింగిల్ పేరెంట్ లేదా మహిళ అనే విషయాన్ని కోర్టు పరిగణించలేదని, బదులుగా, కేసులో ఆమె పాత్ర లేనందున ఆమెకు బెయిల్ మంజూరు చేసింది’ అని న్యాయవాది మీడియాతో చెప్పుకొచ్చారు. ‘కోర్టు ఎలాంటి షరతులు విధించిందో తెలియదు. పవిత్ర గౌడను సోమవారం విడుదల చేసే అవకాశం ఉందని కోర్టు ఆదేశించిన తర్వాతే సమాచారం అందుతుంది’ అని లాయర్ తెలిపారు. ఇదే సందర్భంగా పవిత్రగౌడ్ తల్లి మాట్లాడుతూ.. ‘నా కుమార్తెకు బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు.

కాగా పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణతో రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి బెంగళూరులో చిత్రహింసలకు గురిచేశారు. తరువాత అతనిని దారుణంగా హత్య చేశారు. అనంతరం అతని మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఈ కేసుకు సంబంధించి జూన్ నెలలో దర్శన్, పవిత్రగౌడ్, నాగరాజ్, జగదీష్ తదితరులను అరెస్ట్ చేశారు. కాగా కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణాలతో గతంలో దర్శన్‌కు మధ్యంతర బెయిల్‌ లభించింది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ రావడంతో ఆయనకు పెద్ద ఊరట లభించినట్లయింది.ఇక ఇదే హత్య కేసులో ఏ1 పవిత్ర గౌడకు బెయిల్ లభించింది. ఆమె 180 రోజులకు పైగా పరప్ప అగ్రగర జైలులో ఉన్నారు. వీరితో పాటు నాగరాజ్, లక్ష్మణ్, ప్రదోష్, జగదీష్, అనుకుమార్‌లకు కూడా హైకోర్టు కోర్టుబెయిల్ మంజూరు చేసింది.

దర్శన్ అండ్ గ్యాంగ్ కు బెయిల్ మంజూరు కావడంపై రేణాకస్వామి తండ్రి కాశీనాథయ్య స్పందించారు. ‘న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. బెయిల్ మంజూరు విషయం మీడియాకు ముందే తెలుసు. విచారణ అనంతరం న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. నిందితులకు తాత్కాలికంగా బెయిల్ మంజూరు చేయవచ్చు. కానీ చివరకు నిందితులకు శిక్ష పడుతుందన్న నమ్మకం ఉంది’ అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!