AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam Movie: రాధేశ్యామ్ సినిమానుంచి క్రేజీ అప్డేట్ .. ఖుషీలో రెబల్ స్టార్ అభిమానులు..

బల్ స్టార్ ప్రభాస్.. జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాధేశ్యామ్’. ఇందులో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. 1960 శాతాబ్దం నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో

Radhe Shyam Movie: రాధేశ్యామ్ సినిమానుంచి క్రేజీ అప్డేట్ .. ఖుషీలో రెబల్ స్టార్ అభిమానులు..
Radheshyam Movie
Rajeev Rayala
|

Updated on: Mar 28, 2021 | 2:16 PM

Share

Radhe Shyam Movie: రెబల్ స్టార్ ప్రభాస్.. జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాధేశ్యామ్’. ఇందులో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. 1960 శాతాబ్దం నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు రాధకృష్ణ. ఈ సినిమా గురించి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదైలన ఈ మూవీ పోస్టర్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 30న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనుంది చిత్రయూనిట్. అయితే ‘రాధేశ్యామ్’ మేకర్స్ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ సినిమాకి బజ్ క్రియేట్ చేయడం లేదని ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్నారు.

అయితే ‘రాధే శ్యామ్’ టీమ్ ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతోందట. వచ్చే నెల నుంచి మొదలుపెట్టి సినిమా రిలీజ్ అయ్యే వరకు రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ బజ్ క్రియేట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను కృష్ణం రాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ మరోసారి రొమాంటిక్ పాత్రలో కనించబోతున్నాడు. ఈ సినిమా హిందీ వెర్షన్ కు మిథున్ – మనన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తుండగా.. తెలుగుతోపాటు మిగిలిన దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘రాధే శ్యామ్’ చిత్రంలో జగపతిబాబు – సత్యరాజ్ – భాగ్యశ్రీ – కునాల్ రాయ్ కపూర్ – సచిన్ ఖేడ్కర్ – మురళి శర్మ – శాషా ఛత్రి – ప్రియదర్శి – రిద్దికుమార్ – సత్యాన్ తదితరులు నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

జక్కన సర్‌ప్రైజ్ గిఫ్ట్‌కు.. షాకైన చెర్రీ..ఫిదా అవుతున్న నెటిజెన్లు..: Rajamouli Gift For Ram Charan Birthday Video.

Holi Theme Telugu Songs: రంగుల హోలీ.. రాగాల కేళీ.. మదిమదినీ పులకింపజేసే ‘సుస్వరాలు’.. ఎన్నటికీ చెరగని గుర్తులు..