Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు బెయిల్ మంజూరు.. షరతులు ఇవే

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రముఖ నటి హేమకు భారీ ఊరట లభించింది. ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార జైలులో ఉన్న ఆమెకు బుధవారం (జూన్ 12) బెయిల్ మంజూరైంది.

Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు బెయిల్ మంజూరు.. షరతులు ఇవే
Actress Hema
Follow us
Basha Shek

|

Updated on: Jun 12, 2024 | 9:01 PM

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రముఖ నటి హేమకు భారీ ఊరట లభించింది. ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార జైలులో ఉన్న ఆమెకు బుధవారం (జూన్ 12) బెయిల్ మంజూరైంది. బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదని, చాలా రోజుల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించామని హేమ తరఫు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదించారు. దీంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది. కాగా కొన్ని రోజుల క్రితం బెంగళూరు పోలీసులు జీ ఆర్ ఫామ్‌హౌస్‌పై దాడి చేసినప్పుడు నటి హేమ కూడా పట్టుబడింది. అయితే ఈ వార్త బయటకు రాగానే, హేమ అదే ఫామ్‌హౌస్ నుండి వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ద్వారా తాను హైదరాబాద్‌లో ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేసిందీ సీనియర్ నటి.

అయితే బెంగళూరు పోలీసులు హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు, అంతేకాకుండా మరికొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలను ఈ పార్టీకి తరలించే ప్రయత్నం చేసినట్లు ధ్రువీకరించారు. దీంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా పంపించారు. అయితే తొలిసారి జారీ చేసిన నోటీసులకు అనారోగ్య కారణాలతో హేమ విచారణకు హాజరు కాలేదు.దీంతో రెండోసారి కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అప్పుడు బుర్ఖా ధరించి విచారణకు హాజరైంది.ఆ తర్వాత కోర్టు ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా హేమ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయితే ఇప్పుడు ఇదే కేసులో హేమకు బెయిల్ లభించడంతో కాస్త ఊరట లభించినట్లయ్యింది.

ఇవి కూడా చదవండి

బిర్యానీ వండుతున్నట్లు కలరింగ్ ఇచ్చి.. చివరకు..

View this post on Instagram

A post shared by KOLLA HEMA (@hemakolla1211)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ బహిష్కరణకు బ్రిటిష్ నేతల డిమాండ్
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ బహిష్కరణకు బ్రిటిష్ నేతల డిమాండ్
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..