Nayanthara: ‘హీరోయిన్లను ఓ మూల నిల్చొబెడతారు..అసలు ఇంపార్టెంట్ ఇవ్వరు’.. నయనతార షాకింగ్ కామెంట్స్..

దాదాపు 10 ఏళ్ల తర్వాత సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది నయనతార. గత కొద్దిరోజులుగా కనెక్ట్ సినిమా ప్రమోషన్లలో నయన్ పాల్గొంటూ స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇస్తుంది. అయితే ఇన్నేళ్లు తాను సినిమా ప్రచారాలకు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది

Nayanthara: హీరోయిన్లను ఓ మూల నిల్చొబెడతారు..అసలు ఇంపార్టెంట్ ఇవ్వరు.. నయనతార షాకింగ్ కామెంట్స్..
Nayanthara

Updated on: Dec 21, 2022 | 6:40 PM

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కనెక్ట్. డైరెక్టర్ అశ్విన్ శరవణన్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని నయన్ భర్త విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్నా్రు. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో ఈనెల 22న తెలుగులో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే ఎప్పుడూ మీడియా ముందుకు.. చిత్ర ప్రమోషన్లలో పాల్గొనని నయన్ కొత్తగా తన రూటు మార్చుకుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది. గత కొద్దిరోజులుగా కనెక్ట్ సినిమా ప్రమోషన్లలో నయన్ పాల్గొంటూ స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇస్తుంది. అయితే ఇన్నేళ్లు తాను సినిమా ప్రచారాలకు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో హీరోయిన్లకు అస్సలు ప్రాధాన్యత ఇవ్వరని.. ప్రమోషన్లలో ఓ మూల నిల్చోబెడతారని చెప్పుకొచ్చింది.

కథానాయికగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు పూర్తిచేసుకుంది నయన్. తన రెండు దశాబ్దాల సినీ ప్రయాణం గురించి ఎలా ఫీలయ్యారు అని అడగ్గా.. ” ఇది చాలా గొప్పగా అనిపిస్తుంది. తలుచుకుంటే 20 ఏళ్లు పూర్తయాయ్యంటే నమ్మలేను. కానీ ఈ ఇరవై సంవత్సరాలలో జీవితంలో అనేక దశలు ఉన్నాయి. వాటి నుంచి చాలా నేర్చుకున్నాను. 18 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఒక దశలో నేను కొన్ని విషయాలను సాధించాలనుకున్నాను. సినీ పరిశ్రమ గురించి మాట్లాడేటప్పుడు మన పేరు చరిత్రలో నిలిచిపోవాలనేది నా కోరిక. ఆ కోరికను భగవంతుడు తీర్చాడని అనుకుంటున్నాను. ఇది ఒక పెద్ద విజయం” అని అన్నారు నయన్.

ఇవి కూడా చదవండి

అలాగే ప్రమోషన్లకు దూరంగా ఉండటానికి గల కారణాలను చెబుతూ.. “నేను నటిగా పదేళ్ల తర్వాత రెండవ దశాబ్దం ప్రారంభించినప్పుడు నాకు కొన్ని కలలు ఉన్నాయి. అప్పట్లో మహిళా ప్రధాన సినిమాలు లేవు. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కథానాయికలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆలోచించాను. ఒక ఆడియో ఫంక్షన్ కు వెళితే హీరోయిన్లను ఒక మూలన నిల్చోబెడతారు. అందుకే అలాంటి కార్యక్రమాలకు హాజరు కావడం మానేశాను. ఇండస్ట్రీలో స్త్రీలను పురుషులతో సమానంగా చూడాలి. సమానం కాకపోయినా.. కనీసం ప్రాముఖ్యత ఇవ్వాలని భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.