AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Committee Kurrollu: బాక్సాఫీస్ దగ్గర ‘కమిటీ కుర్రోళ్ళు’ రచ్చ.. రెండు రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే..?

యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మాతగా విడుదలైన సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు. ఇరవై మందికి పైగా కొత్త నటులతో ఈ సినిమా తెరకెక్కింది. కోనసీమలోని ఒక గ్రామంలో ఉండే కుర్రాళ్ల ప్రేమలు, చదువులు, ఆ గ్రామ జాతర, రాజకీయాలు కేంద్రంగా సాగుతుంది ఈ సినిమా కథ.

Committee Kurrollu: బాక్సాఫీస్ దగ్గర ‘కమిటీ కుర్రోళ్ళు’ రచ్చ.. రెండు రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే..?
Committee Kurrollu
Ram Naramaneni
|

Updated on: Aug 11, 2024 | 4:22 PM

Share

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. తొలి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ పెరగటం సినిమాకు దక్కిన ఆద‌రణ‌ను తెలియచేస్తోంది.

రెండు రోజుల్లోనే క‌మిటీ కుర్రోళ్లు సినిమా రూ. 3.69 కోట్ల‌ను రాబ‌ట్టింది. మంచి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో స్నేహం, ప్రేమ‌, కుటుంబంలోని భావోద్వేగాల‌ను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తూ ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రించార‌ని ..ఆదివారం కూడా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతుంద‌ని, క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరుగుతాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి.

నటీనటులు :

సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య,విషిక వంటి కొత్త ఆర్టిస్టులు యాక్ట్ చేశారు.   సాయి కుమార్ ,గోపరాజు రమణ, బలగం జయరాం, శ్రీ లక్ష్మి , కంచెరపాలెం కిషోర్ , కిట్టయ్య , రమణ భార్గవ్, జబర్దస్త్ సత్తిపండు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

సాంకతిక వర్గం :

సమర్పణ – నిహారిక కొణిదెల, బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు – పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక….. రచన, దర్శకత్వం – యదు వంశీ….సినిమాటోగ్రఫీ – రాజు ఎడురోలు…. మ్యూజిక్ డైరెక్టర్ – అనుదీప్ దేవ్…. ప్రొడక్షన్ డిజైనర్ – ప్రణయ్ నైని…. ఎడిటర్ – అన్వర్ అలీ… డైలాగ్స్ – వెంకట సుభాష్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల…. ఫైట్స్ – విజయ్, డ్యాన్స్ – జె.డి మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మన్యం రమేష్, సౌండ్ డిజైన‌ర్‌: సాయి మ‌ణింద‌ర్ రెడ్డి, పోస్ట‌ర్స్‌: శివ‌

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..