Premalu 2: ప్రేమలు 2 పై క్రేజీ అప్డేట్.. ఈసారి మరింతగా ఫ్రెష్ గా..
ప్రేమలు.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే బాగా వినిపిస్తోంది. మలయాళంలో ఒక చిన్న సినిమాగా రిలీజై ఏకంగా వంద కోట్లు రాబట్టిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇప్పుడు తెలుగులోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రానికి యువత బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ప్రేమలు సినిమా అంచనాలకు మించి వసూళ్లను సాధిస్తోంది.

మలయాళ సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. రీసెంట్ డేస్ లో చాలా మలయాళ సినిమాలు విడుదలై తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతే కాదు ఓటీటీలో మలయాళ సినిమాలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఓటీటీలో మలయాళ సినిమాలకు కొదవే లేదు.. ఇక గత ఏడాది ప్రేక్షకులను మెప్పించిన సినిమాల్లో ప్రేమలు సినిమా ఒకటి. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఫ్రెష్ లవ్ స్టోరీతో పాటు ఆకట్టుకునే కామెడీతో మెప్పించింది ఈ మూవీ. దర్శకుడు క్రిష్ ఏడీ దర్శకత్వంలో గతేడాది ఫిబ్రవరిలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ప్రేమలు సినిమాలో నస్లెన్, మమితా బైజు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాను ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ నిర్మించారు. ఈ సినిమా తర్వాత మమితా బైజు ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది.
సినిమా తర్వాత నుంచి మమితా బైజు ను అందరూ ప్రేమలు బ్యూటీ అని పిలవడం మొదలు పెట్టారు. కుర్రకారు ఈ చిన్నదాని కోసం గూగుల్ ను సోషల్ మీడియాలో తెగ సర్చ్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రేమలు సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారని మాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ప్రేమలు సినిమాకు సీక్వెల్ పై క్లారిటీ వచ్చింది.
ప్రేమలు సీక్వెల్ గురించి కూడా గత ఏడాది అప్‌డేట్ విడుదలైంది. ఈ సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపధ్యంలో జూన్‌లో సినిమా షూటింగ్‌ని ప్రారంభించి డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుందని తెలుస్తుంది. షూటింగ్ లొకేషన్లు, నటీనటుల ఎంపిక శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. దీంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. మరి ప్రేమలు 2లో నస్లెన్, మమితా బైజునే నటిస్తారా.? లేదా అన్నది చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




