Chiyaan Vikram: హీరో Vs స్టార్ డైరెక్టర్.. విక్రమ్ కౌంటర్‏కు అనురాగ్ యూటర్న్.. ఫ్యాన్స్ ఆగ్రహం..

|

May 23, 2023 | 6:28 PM

ఈ సినిమా కథను తమిళ్ స్టార్ హీరో విక్రమ్ ను దృష్టిలో పెట్టుకుని రాశాను. విక్రమ్ ఒరిజినల్ నేమ్ కెన్నెడీ. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆయనకు వినిపించకముందే కెన్నెడీ అనే టైటిల్ పెట్టాను. కథ మొత్తం రాసిన తర్వాత విక్రమ్ కు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఆయన సమాధానం కోసం చాలారోజులు వెయిట్ చేసాను.

Chiyaan Vikram: హీరో Vs స్టార్ డైరెక్టర్.. విక్రమ్ కౌంటర్‏కు అనురాగ్ యూటర్న్.. ఫ్యాన్స్ ఆగ్రహం..
Vikram Chiyaan, Anurag Kash
Follow us on

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో అనురాగ్ కశ్యప్ ఒకరు. ఇప్పటివరకు కమర్షియల్ ఎలిమెంట్స్‏తోపాటు.. విభిన్నమైన కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. అయితే గత కొంత కాలంగా ఆయన తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోవడం లేదు. దీంతో భారీ విజయాన్ని అందుకోవడానికి అనురాగ్ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం కెన్నెడీ. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నిర్వహిస్తోంది చిత్రయూనిట్. అక్కడ ఈ సినిమా స్క్రీనింగ్ కాబోతుందని తెలుస్తోంది. ఈ వేడుకలకు అతిధిగా హాజరయ్యారు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ అనురాగ్ మాట్లాడుతూ..”ఈ సినిమా కథను తమిళ్ స్టార్ హీరో విక్రమ్ ను దృష్టిలో పెట్టుకుని రాశాను. విక్రమ్ ఒరిజినల్ నేమ్ కెన్నెడీ. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆయనకు వినిపించకముందే కెన్నెడీ అనే టైటిల్ పెట్టాను. కథ మొత్తం రాసిన తర్వాత విక్రమ్ కు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఆయన సమాధానం కోసం చాలారోజులు వెయిట్ చేసాను. ఒకసారి రాహుల్ కు కథ చెప్పాను. స్క్రిప్ట్ ఆయనకు ఇచ్చిన సమయంలో కనబర్చిన ఆసక్తి నాకు చాలా నచ్చింది. స్క్రిప్ట్ అంతగా నచ్చింది కాబట్టే రాహుల్ ఈ సినిమాకు ఆయన న్యాయం చేస్తాడని ఆయనతో సినిమా చేశాను. విక్రమ్ కు కథ నచ్చలేదు.. ఆయన నుంచి ఆన్సర్ రాకపోవడంతో… రాహుల్ తో సినిమా చేశాను.. ఇప్పుడీ మూవీ సంచలనం కాబోతుందని “అన్నాడు. అయితే అనురాగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి.

తాజాగా అనురాగ్ కశ్యప్ చేసిన కామెంట్స్ పై హీరో విక్రమ్ చియాన్ స్పందించారు. “ప్రియమైన అనురాగ్ కశ్యప్. సోషల్ మీడియాలో మా స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం ఒక సంవత్సరం క్రితం జరిగిన మన సంభాషణను నేను మళ్లీ గుర్తుచేస్తున్నాను. ఈ చిత్రం కోసం మీరు నన్ను సంప్రదించడానికి ప్రయత్నించారని (ఈమెయిల్, మెస్సేజ్ లో రూపంలో).. అయితే నేను స్పందించలేదని మీరు అనుకున్నట్లు నాకు మరొక నటుడి ద్వారా తెలిసింది. వెంటనే నేను మీకు కాలే చేసి.. మీరు ఏదైనే మెయిల్ ఐడీకీ సందేశాలు పంపించారో ఆ మెయిల్ ఐడి ఇప్పుడు యాక్టివ్‌గా లేదని.. అలాగే నా నంబర్ మార్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నందున నాకు ఎటువంటి మెయిల్ లేదా సందేశం రాలేదని గతంలోనే మీకు చెప్పాను. అలాగే కెన్నెడీ చిత్రం నాకు చాలా నచ్చిందని కూడా చెప్పాను ” అంటూ ట్వీట్ చేశారు విక్రమ్.

ఇవి కూడా చదవండి

అయితే దీనిపై అనురాగ్ స్పందిస్తూ..”నిజమే సార్. నేను మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు మరొక నటుడి నుండి తెలుసుకున్నప్పుడు నేరుగా నాకు కాల్ చేసారు. ఆయన వద్ద వేరే వాట్సాప్ నంబర్ ఉందని .. అలాగే తన అధికారిక మెయిల్ ఐఢీ నాకు ఇచ్చారు. ఆయన నా స్క్రిప్ట్ చదవడానికి ఆసక్తిని కూడా చూపించారు. కానీ అప్పటికే మేమంతా షూటింగ్ కోసం షెడ్యూల్ పాలన్ చేసుకున్నాం. అలాగే సినిమాకి “కెన్నెడీ” అనే పేరును ఉపయోగించుకోవడానికి ఆయన పూర్తిగా అంగీకారం తెలిపారు. ఇటీవల నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో కెన్నెడీ అనే పేరు పెట్టడానికి గల కారణాన్ని మాత్రమే చెప్పాను. నా వ్యాఖ్యలను అతిగా చూడాల్సిన అవసరం లేదు. ఆయనతో కలిసి పనిచేయకుండా నేను రిటైర్ అయితే కాను ” అంటూ రిప్లై ఇచ్చారు. అనురాగ్ తీరుపై విక్రమ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని చెప్పేముందు క్లారిటీగా చెప్పాలని.. ఇష్టానుసారంగా కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.