Chiyaan Vikram: కోలీవుడ్‌లో క్రేజీ మల్టీస్టారర్ రానుందా..? ఆ హీరోతో సినిమా ఉంటుందని హింట్ ఇచ్చిన విక్రమ్

ఇటీవల కాలంలో మల్టీస్టార్ సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలు కుర్ర హీరోలతో కలిసి సినిమాలు చేస్తున్నారు.

Chiyaan Vikram: కోలీవుడ్‌లో క్రేజీ మల్టీస్టారర్ రానుందా..? ఆ హీరోతో సినిమా ఉంటుందని హింట్ ఇచ్చిన విక్రమ్
Chiyaan Vikram
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 04, 2022 | 9:00 AM

ఇటీవల కాలంలో మల్టీస్టార్ సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలు కుర్ర హీరోలతో కలిసి సినిమాలు చేస్తున్నారు. అంతే కాదు ఇద్దరు స్టార్ హీరోలు కూడా కలిసి నటిస్తున్నారు. లేడీ క్యామియో రోల్స్ లోకూడా కనిపించి ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే మనదగ్గర చాలా మంది హీరోలు మల్టీస్టారర్ సినిమాలతో ఆకట్టుకున్నారు. తాజాగా ఇద్దరు తమిళ్ స్టార్ హీరోలు కలిసి ఓ సినిమా నటించనున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో కాదు. విక్రమ్ , విజయ్. అవును ఇప్పుడు ఇదే వార్త కోలివుడ్ కో కోడై కూస్తోంది. చియాన్ విక్రమ్(Chiyaan Vikram), దళపతి విజయ్ కలిసి ఓ సినిమాలో నటించనున్నారట.

విక్రమ్ ఇటీవలే కోబ్రా సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాగే దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు కలిసి ఓ సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. తాజాగా కోబ్రా ప్రమోషన్స్ లో భాగంగా విక్రమ్ మాట్లాడుతూ విజయ్ గురించి ఆసక్తికర కామెట్స్ చేశాడు. తాజాగా మీడియాతో విక్రమ్ మాట్లాడుతూ.. దళపతి విజయ్ స్టైల్.. డైలాగ్ డెలివరీ.. డాన్స్ అంటే తనకి ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. అలాగే ఆయనతో ఒక మల్టీస్టారర్ చేయాలనే ఆశతో ఉన్నానని అన్నారు. భవిష్యత్తులో తమ కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుందని తెలిపారు విక్రమ్. దాంతో దళపతి ఫ్యాన్స్, విక్రమ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. నిజంగా ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..