ఫ్యాన్స్‌కు మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్ అదేనా !
'ఖైదీ నెంబర్ 150' సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన చేసిన పాన్ ఇండియా మూవీ 'సైరా' అనుకున్న స్థాయిలో ఆడలేదు.
Chiranjeevi Birthday : ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన చేసిన పాన్ ఇండియా మూవీ ‘సైరా’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాగా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్టులకు ఓకే చెప్తూ ప్రజంట్ మంచి జోరుమీద ఉన్నాడు చిరు. ఈ కరోనా హడావిడి లేకపోతే ఇప్పటికే ఆయన కొరటాల శివతో చేస్తోన్న ‘ఆచార్య’ మూవీ కంప్లీట్ అయిపోయేది. కాగా ‘లూసిఫర్’ రీమేక్ చేయాలని నిర్ణయించుకుని.. ఆ సినిమా బాధ్యతలను యంగ్ డైరెక్టర్ సుజీత్ చేతిలో పెట్టారు చిరంజీవి. కానీ అతడు మెగాస్టార్‌ని అంతగా ఇంప్రెస్ చెయ్యలేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీంతో ఈ సినిమా బాధ్యతలు సీనియర్ డైరెక్టర్ వివి వినాయక్‌కు అప్పగించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అసలు కొంతకాలం ఈ ప్రాజెక్ట్‌ని చిరు పక్కన పెడుతున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఈ చిత్రంపై చాలా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ లోపులోనే మెగాస్టార్ బర్త్ డే దగ్గరికి వచ్చింది. ఆగస్టు 22న చిరంజీవి తన పుట్టునరోజు జరుపుకోబోతున్నారు. ఆ రోజున ఆయన కొత్త సినిమాలకు సంబంధించి ఏమైనా అప్‌డేట్స్ వస్తాయెమో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
కాగా ‘లూసిఫర్’ గురించి ఎటువంటి అప్‌డేట్ రాకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం ఉంది. కాకపోతే యంగ్ డైరెక్టర్ బాబీ తన స్క్రిప్ట్‌తో మెగాస్టార్‌ను ఇంప్రెస్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫైనల్ వెర్షన్ కూడా ఆయనకు బాగా నచ్చిందట. ఈ మూవీని మైత్రి వాళ్లే నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానుల కోసం ఈ సినిమా నుంచే ఏదో ఒక అప్‌డేట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read More : సుశాంత్ మరణంపై సీబీఐ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్