బాల‌య్య‌కు బాస్ స్వీట్ విషెస్..ఆల్ సెట్…

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో, న‌ట‌సింహా నంద‌మూరి బాలకృష్ణ నేడు 60వ ప‌డిలోకి అడుగుపెట్టారు. ఈ క్ర‌మంలో దేశం న‌లుమూల‌ల నుంచి ఆయ‌నకు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.

  • Ram Naramaneni
  • Publish Date - 3:06 pm, Wed, 10 June 20
బాల‌య్య‌కు బాస్ స్వీట్ విషెస్..ఆల్ సెట్...

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో, న‌ట‌సింహా నంద‌మూరి బాలకృష్ణ నేడు 60వ ప‌డిలోకి అడుగుపెట్టారు. ఈ క్ర‌మంలో దేశం న‌లుమూల‌ల నుంచి ఆయ‌నకు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బాల‌య్య‌ను దైవంగా భావించే ఆయ‌న అభిమానులు ఘ‌నంగా వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు. ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్​ ద్వారా బాల‌య్య‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదే ఉత్సాహంతో, ఉత్తేజంతో నిండు నూరేళ్ల సంబరం బాలయ్య జరుపుకోవాలని, అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. బాల‌య్య‌పై చిరు ట్వీట్ ఇప్పుడు టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది.

వాస్తవంగా ఇటీవ‌ల బాల‌య్య‌కు, చిరుకు మ‌ధ్య కోల్డ్ వార్ జ‌రిగ‌నట్టు వార్త‌లు వ‌చ్చాయి. మొన్నామ‌ధ్య సినిమా షూటింగులు, థియేట‌ర్లు పునఃప్రారంభంపై మొద‌ట చిరంజీవి ఇంట్లో భేటీ అయిన సినిమా పెద్ద‌లు, ఆ త‌ర్వాత సీఎం కేసీఆర్ ను సైతం క‌లిశారు. అయితే బాల‌య్య‌ను ఈ మీటింగుకు ఆహ్వానించ‌క‌పోవ‌డంపై ఆయ‌న బాహాటంగానే ఫైర‌య్యారు. బాల‌య్య కామెంట్స్ కు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కౌంట‌ర్స్ ఇవ్వ‌డం వైర‌ల‌య్యింది. ఈ నేప‌థ్యంలో తాజాగా బాల‌య్య‌కు బ‌ర్త్ డే విషెస్ తెలిపి త‌మ మ‌ధ్య ఎటువంటి భేష‌జాలు లేవ‌ని చెప్ప‌క‌నే చెప్పారు చిరు.