Vijay Deverakonda: రౌడీ హీరో ఏడాదికి ఎంత సంపాదిస్తాడు.. ఒక్కో సినిమాకి అతడి రెమ్యూనరేషన్ ఎంత..?

పాన్‌ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్రీడా రంగంలో అడుగుపెట్టాడు. ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ జట్లలో ఒకటైన హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ కో ఓనర్‌గా మారాడు.

Vijay Deverakonda: రౌడీ హీరో ఏడాదికి ఎంత సంపాదిస్తాడు.. ఒక్కో సినిమాకి అతడి రెమ్యూనరేషన్ ఎంత..?
Vijay Deverakonda
Follow us

|

Updated on: Jan 26, 2023 | 9:28 AM

విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రామిసింగ్ హీరో. అటు పాన్ ఇండియా లెవల్‌లో కూడా మన కుర్రాడి పేరు మారుమోగిపోతుంది. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో విజయ్ క్రేజ్ నెక్ట్స్ లెవల్‌కి చేరింది. లైగర్‌తో నేషనల్ లెవల్‌ ఇమేజ్ దక్కించుకున్నాడు. సోషల్ మీడియాలోనూ ఈ రౌడీ హీరో క్రేజ్ వేరే లెవల్. తనకంటూ సెపరేట్ స్వాగ్ ఉంటుంది. అందుకు తగ్గట్లుగా ప్యాన్ బేస్ ఉంది. విజయ్ తన అభిమానులను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. వారిని తన సొంత ఖర్చులతో ట్రిప్స్‌కి కూడా పంపుతాడు. తాజాగా ఈ హీరో.. ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ టీమ్స్‌లో ఒకటైన హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ సహ- యజమానిగా మారాడు. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క జట్టు ఇది. మన స్ఫూర్తి,  శక్తికి ప్రతీకగా ఈ టీమ్ నిలుస్తుందని విజయ్ పేర్కొన్నాడు.

నివేదికల ప్రకారం, విజయ్ ఈ జట్టులో వాటాలను పొందడానికి 160 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని వెచ్చించాడట. ఇది అతని మొదటి బిజినెస్ వెంచర్ కాదు. అతడు హిల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాణ సంస్థ నిర్వహిస్తున్నాడు. రౌడీ వేర్ అనే బ్రాండ్ క్లోత్ షోరూమ్స్ కూడా ఉన్నాయి.  ఈ పెట్టుబడులు అన్నీ చూస్తే.. అతని ఆస్తులు విలువ ఎంత అన్న అనుమానం కలుగుతుంది. రిపోర్ట్స్ ప్రకారం, విజయ్ ఏడాదికి రూ. రూ. 55 కోట్లు వరకు సంపాదిస్తాడట. అతను కొన్ని బ్రాండ్‌లను కూడా ప్రమోట్ చేస్తున్నాడు. ఇది అతని ఆదాయాన్ని పెంచుతుంది.

విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు తన రెమ్యూనరేషన్‌గా 12 కోట్ల రూపాయలకు పైగా తీసుకుంటాడట. సినిమా స్థాయిని బట్టి రెమ్యూనరేషన్ పెరుగుతుంది. అతని చివరి పాన్-ఇండియా చిత్రం ‘లైగర్’ కోసం 35 కోట్లు పారితోషికం తీసకున్నాడట. విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ డైరక్షన్‌లో ఖుషి మూవీ చేస్తున్నాడు. ఇందులో సమంత ఫీమేల్ లీడ్ చేస్తుంది. పూరి డైరెక్షన్‌లో చేయాల్సిన జనగణమన చిత్రం ఆగిపోయిందా, ఉంటుందా అన్న విషయంపై క్లారిటీ లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్